Sunny Leone photo on admit card: హాల్‌టికెట్‌పై సన్నీలియోని పిక్.. వైరల్-actress sunny leone photo printed on admit card of tet 2022 probe ordered ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Actress Sunny Leone Photo Printed On Admit Card Of Tet 2022 Probe Ordered

Sunny Leone photo on admit card: హాల్‌టికెట్‌పై సన్నీలియోని పిక్.. వైరల్

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 11:33 AM IST

Sunny Leone photo on admit card: టెట్ హాల్ టికెట్‌పై సన్నీలియోని ప్రత్యక్షమైంది.

హాల్ టికెట్‌పై సన్నీలియోనీ ఫోటో రావడంతో విచారణకు ఆదేశించిన విద్యా శాఖ
హాల్ టికెట్‌పై సన్నీలియోనీ ఫోటో రావడంతో విచారణకు ఆదేశించిన విద్యా శాఖ (HT_PRINT)

నవంబర్ 6న జరిగిన కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2022)కి హాజరైన అభ్యర్థి హాల్ టికెట్‌పై బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫోటో ముద్రించి ఉంది. ఈ ఘటనపై విద్యా శాఖ విచారణకు ఆదేశించింది. అడ్మిట్ కార్డు స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

శివమ రుద్రప్ప కాలేజీలో ఓ విద్యార్థిని హాల్‌టికెట్‌‌పై సన్నీలియోన్ ఫోటో ఉండడంతో అధికారులు కంగుతిన్నారు. తర్వాత అక్కడి ప్రిన్సిపాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేసేటప్పుడు, సమర్పించేటప్పుడు లేదా ఫోటోను అప్‌లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.

అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించలేదని, తన తరపున ఇతరులను చేయమని కోరిందని తెలిసింది. అయితే అభ్యర్థే స్వయంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించాలని, దాని కోసం కేటాయించిన వినియోగదారు ఐడీ, పాస్‌వర్డ్ ఎవరికీ ఇవ్వరాదని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పరీక్ష హాల్‌టికెట్‌ను అభ్యర్థులు మాత్రమే రూపొందించాలి కాబట్టి దానిలో తమ పాత్ర ఏమీ లేదని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ‘ఈ అంశంలో ఏ మీడియా రిపోర్ట్ చేసినప్పటికీ ఇందులో డిపార్ట్‌మెంట్ పాత్ర లేదు. ఇంకా ఈ విషయంపై విచారణ జరిపి, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మేం పోలీసులను అభ్యర్థించాం..’ అని సంబంధిత విభాగం వివరణలో పేర్కొంది.

IPL_Entry_Point