Unmarried woman in India : 'సోలో లైఫే సో బెటరు..'- దేశంలో 81శాతం మంది మహిళలకు పెళ్లే వద్దంట!
Unmarried woman in India : సింగిల్‌గా ఉంటే ప్రశాంతంగా ఉంటుందని దేశంలోని మహిళలు భావిస్తున్నారు! ఇటీవలే జరిగిన ఓ సర్వే ప్రకారం.. దేశంలోని 81శాతం మంది మహిళలు.. తమకు అసలు పెళ్లే వద్దని చెప్పారు!
Woman in India : దేశంలో పెళ్లిళ్ల సీజన్ హడావుడి మొదలైంది. రానున్న రెండు- మూడు నెలల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల అభిప్రాయాలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. 81శాతం మంది భారతీయ మహిళలకు అసలు పెళ్లే వద్దంట! పెళ్లి చేసుకోవడం కన్నా సింగిల్‌గా ఉండటమే బెటర్ అని వారు భావిస్తున్నారట.
సోలో లైఫే సో బెటరు..!
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో.. ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ ఇటీవలే ఓ సర్వే చేపట్టింది. పెళ్లిళ్ల సీజన్లో.. తల్లిదండ్రుల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతుందని.. ఐదింట ఇద్దరు (39శాతం) మహిళలు పేర్కొన్నారు. పెళ్లి టాపిక్ వస్తే ఒత్తిడికి గురవుతామని 39శాతం మంది తెలిపారు. దీర్ఘకాలిక రిలేషన్లోకి వెళ్లాలని తమను బలవంతం చేస్తున్నట్టు 33శాతం మంది మహిళలు వివరించారు.
Bumble dating app survey on woman : ఇక మహిళలపై జరిగిన సర్వేలో భాగంగా.. 81శాతం మంది.. తమకు పెళ్లి వద్దని, సింగిల్‌గానే జీవించడానికి ఇష్టపతామని పేర్కొన్నారు. డేటింగ్ విషయంలోనూ మహిళలు రాజీపడటం లేదు! తమ ఇష్టలు, అవసరాలకు తగ్గట్టుగానే డేటింగ్ చేస్తామని 63శాతం మంది అన్నారు. మరీ ముఖ్యంగా.. ‘సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తామే కానీ ఎవరుపడితే వారితో డేటింగ్ చేయమ’ని.. 83శాతం మంది మహిళలు చెప్పడం గమనార్హం.
"పెళ్లిళ్ల సీజన్ అంటే ఇండియాలో ఘనంగా ఉంటుంది. కానీ ఈ సమయంలోనే సింగిల్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారిని 'సింగిల్-షేమింగ్' చేస్తారు. ముఖ్యంగా సింగిల్‌గా ఉండే మహిళలపై ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది. ఫలితంగా సింగిల్‌గా ఉండే మహిళలు సమాజానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఫంక్షన్లకు వెళ్లడం తలనొప్పిగా ఉంటుందని ఫీల్ అవుతున్నారు," అని బంబుల్ కమ్యూనికేషన్స్ డైరక్టర్ సమర్పిత సమద్దర్ వెల్లడించారు.
Survey on unmarried woman in India : దేశంలో పెళ్లికి వ్యతిరేకిస్తున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది! రిలేషన్లోకి వెళ్లాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. ఈ విషయాన్ని పెద్దలతో కమ్యూనికేట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి టాపిక్ ఎప్పుడొచ్చినా.. దాటవేస్తూ, తల్లిదండ్రుల నుంచి తప్పించుకుంటున్నారు.
సంబంధిత కథనం