Writer Padmabhushan Collections: రైటర్ పద్మభూషణ్‌కు భారీ లాభాలు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?-writer padmabhushan collects over 10 crores as producers get huge profits ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Writer Padmabhushan Collects Over 10 Crores As Producers Get Huge Profits

Writer Padmabhushan Collections: రైటర్ పద్మభూషణ్‌కు భారీ లాభాలు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 13, 2023 07:20 PM IST

Writer Padmabhushan Collections: రైటర్ పద్మభూషణ్‌కు భారీ లాభాలు వచ్చాయి. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.

రైటర్ పద్మభూషణ్ మూవీ
రైటర్ పద్మభూషణ్ మూవీ

Writer Padmabhushan Collections: రైటర్ పద్మభూషణ్.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన సినిమా. ఈ మూవీ రిలీజైనప్పుడు అసలు ఇలాంటి సినిమా ఒకటుందని చాలా మందికి తెలియదు. కానీ ఒక్కసారి రిలీజైన తర్వాత మాత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ.10 కోట్లు వసూలు చేమడం విశేషం. ఈ మూవీని తెరకెక్కించిన నిర్మాతలు లాభాల పంట పండించుకున్నారు. చాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ సినిమాలో క్లైమ్యాక్స్ అభిమానులను కట్టి పడేసింది. చివరి సీన్లలోని భావోద్వేగాలు ప్రేక్షకులు కంటతడి పెట్టేలా చేశాయి.

ఈ సినిమా హిట్ టాక్ కొట్టేయడంతో నాన్ థియేట్రికల్ హక్కులకు రూ.20 కోట్లు రావడం విశేషం. ఈ మూవీలో సుహాస్ లీడ్ రోల్ లో నటించాడు. తన పేరు ఉపయోగించుకొని ఎవరో బుక్ పబ్లిష్ చేయడంతో సమస్యల్లో పడే రచయితగా అతడు కనిపించాడు. అటు అమెరికాలోనూ ఈ సినిమా ఇప్పటి వరకూ 3 లక్షల డాలర్లు వసూలు చేసింది.

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ కథ ఇదీ..

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ చూసి ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సినిమా అనే న‌మ్మ‌కంతో థియేట‌ర్‌లో అడుగుపెట్టిన ప్రేక్ష‌కుల‌కు ఫ‌న్‌తో పాటు చ‌క్క‌టి సందేశాన్ని అందించి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్ట‌ర్ ష‌ణ్ముఖ్ ప్ర‌శాంత్.

నిజాయితీతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌ పేరు, డ‌బ్బు ఏదైనా దానిని మ‌న‌స్ఫూర్తిగా ఆస్వాదించ‌గ‌లుగుతాం. అలా కాకుండా అప్ప‌నంగా వ‌చ్చే పేరుప్ర‌తిష్ట‌ల్ని ఎంజాయ్ చేయ‌డంలో భ‌యం అభ‌ద్ర‌తా భావం క‌లుగుతాయి. అలాంటి ఓ ర‌చ‌యిత క‌థతో ఈ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.

మహేష్ బాబు మెచ్చిన సినిమా

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ సినిమాను మ‌హేష్‌బాబు ప్ర‌త్యేకంగా వీక్షించారు. చిన్న సినిమాపై అత‌డు ప్ర‌శంస‌లు కురిపించాడు. రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఫ్యామిలీస్ అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా అని మ‌హేష్‌బాబు పేర్కొన్నాడు.

మ‌న‌సుల్ని క‌దిలించే మంచి సినిమా ఇద‌ని తెలిపాడు. క్లైమాక్స్ త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ద‌ని చెప్పాడు. సినిమాను తాను ఎంజాయ్ చేశాన‌ని, సుహాన్ న‌ట‌న బాగుంద‌ని మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం