Vijay Varisu Run Time: వారిసు ర‌న్ టైమ్ రివీల్ - సంక్రాంతి రిలీజ్‌ల‌లో పెద్ద సినిమా ఇదే-vijay varisu runtime revealed pongal releases in tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Varisu Runtime Revealed Pongal Releases In Tollywood

Vijay Varisu Run Time: వారిసు ర‌న్ టైమ్ రివీల్ - సంక్రాంతి రిలీజ్‌ల‌లో పెద్ద సినిమా ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Jan 03, 2023 02:09 PM IST

Vijay Varisu Run Time: విజ‌య్ వార‌సుడు ర‌న్‌టైమ్‌ను మంగ‌ళ‌వారం రివీల్ చేశారు. సంక్రాంతి రిలీజ్‌ల‌లో ర‌న్‌టైమ్ ప‌రంగా వార‌సుడు పెద్ద సినిమా కావ‌డం కావ‌డం గ‌మ‌నార్హం.

విజ‌య్
విజ‌య్

Vijay Varisu Run Time: సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల్లో ర‌న్‌టైమ్‌ ప‌రంగా విజ‌య్ వారిసు బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా నిల‌వ‌నుంది. మంగ‌ళ‌వారం ఈ సినిమా ర‌న్‌టైమ్‌ను రివీల్ చేశారు. రెండు గంట‌ల యాభై నిమిషాల నిడివితో వారిసును రిలీజ్ చేయ‌బోతున్నారు.

తెలుగులో ఈ సినిమా జనవరి 12న వార‌సుడు పేరుతో విడుదలకానుంది. సంక్రాంతికి విజ‌య్ వార‌సుడుతో పాటు చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు అజిత్ తెగింపు కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

ఈ స్ట్రెయిట్‌, డ‌బ్బింగ్ సినిమాల్లో లెంగ్త్ ప‌రంగా విజ‌య్ వార‌సుడు పెద్ద సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసిన‌ట్లు తెలిసింది. వారిసు సినిమాకు క్లీన్ యూ స‌ర్టిఫికెట్ ల‌భించిన‌ట్లు స‌మాచారం.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు నిర్మిస్తోన్నారు. ఈ సినిమాతోనే నిర్మాత‌గా దిల్‌రాజు త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో విజ‌య్‌కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సుల్తాన్ అనంత‌రం దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత త‌మిళంలో ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న సినిమా ఇది. ప్ర‌భు, ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, ఖుష్బూ, సంగీత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. త‌మిళంతోపాటు తెలుగులో భారీ స్థాయిలో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతున్న‌ది.

IPL_Entry_Point