Unstoppable Prabhas Episode Glimpse: డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ - అన్‌స్టాప‌బుల్ ప్ర‌భాస్ ఎపిసోడ్ గ్లింప్స్‌ రిలీజ్‌-unstoppable with nbk prabhas episode glimpse viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Unstoppable With Nbk Prabhas Episode Glimpse Viral On Social Media

Unstoppable Prabhas Episode Glimpse: డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ - అన్‌స్టాప‌బుల్ ప్ర‌భాస్ ఎపిసోడ్ గ్లింప్స్‌ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 14, 2022 09:16 AM IST

Unstoppable Prabhas Episode Glimpse: : బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్‌షో ఆరో ఎపిసోడ్‌కు టాలీవుడ్ అగ్ర హీరోలు ప్ర‌భాస్‌, గోపీచంద్ గెస్ట్‌లుగా హాజ‌రుకానున్నారు. ఈ ఎపిసోడ్ తాలూకు గ్లింప్స్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌భాస్‌
ప్ర‌భాస్‌

Unstoppable Prabhas Episode Glimpse: : అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్‌లో ఊహించిన గెస్ట్‌ల‌తో అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు హోస్ట్ బాల‌కృష్ణ‌. ఈ వారం రిలీజ్ కానున్న ఆరో ఎపిసోడ్‌కు ప్ర‌భాస్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నాడు. అత‌డితో పాటు గోపీచంద్ ఈ షోలో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఈ ఎపిసోడ్ తాలూకు గ్లింప్స్ మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

ఇందులో బాహుబ‌లి అంటూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాయిస్ వినిపించ‌గానే స్టైలిష్‌గా ప్ర‌భాస్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌భాస్ ఎంట్రీతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌తో సంద‌డి చేశారు. రేయ్ ఏం చెబుతున్నావు డార్లింగ్ అంటూ ప్ర‌భాస్ మ‌రో యంగ్ హీరోతో ఫోన్‌లో మాట్లాడుతున్న‌ట్లుగా ఈ గ్లింప్స్ లో చూపించారు. గోపీచంద్ చెప్పిన మాట‌ల‌కు ప్ర‌భాస్ స‌ర‌దాగా దండం పెట్టిన‌ట్లుగా చూపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. అలాగే బాల‌కృష్ణ వేసిన పంచ్‌ల‌కు ప్ర‌భాస్ న‌వ్వుతూ క‌నిపించారు.

కేవ‌లం ఒకే ఒక డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ గ్లింప్స్ లో ప్ర‌భాస్ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. సాధార‌ణంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌లో త‌ప్పితే మిగిలిన స‌మ‌యాల్లో ప్ర‌భాస్ బ‌య‌ట క‌నిపించ‌డం త‌క్కువే. తొలిసారి అత‌డు ఈ టాక్‌షోకు హాజ‌రుకావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ షోలో త‌న పెళ్లి గురించి ప్ర‌భాస్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ఈ ఎపిసోడ్ షూటింగ్ చేశారు. డిసెంబ‌ర్ 16న శుక్ర‌వారం ప్ర‌భాస్‌, గోపీచంద్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. త్వరలో ప్రోమో రిలీజ్ చేయబోతున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.

IPL_Entry_Point