Kalpika Ganesh Wild Statements: మరోసారి కల్పికా గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ నటి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని వెల్లడి!-tollywood actress kalpika ganesh wild statements against dhanya balakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Actress Kalpika Ganesh Wild Statements Against Dhanya Balakrishna

Kalpika Ganesh Wild Statements: మరోసారి కల్పికా గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ నటి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని వెల్లడి!

Maragani Govardhan HT Telugu
Dec 16, 2022 05:23 PM IST

Kalpika Ganesh Wild Statements: టాలీవుడ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కల్పిక గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటి ధన్యా బాలకృష్ణపై ఈ సారి షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని స్పష్టం చేసింది.

కల్పికా గణేష్-ధన్యా బాలకృష్ణ
కల్పికా గణేష్-ధన్యా బాలకృష్ణ

Kalpika Ganesh Wild Statements: కల్పిక గణేష్.. టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించిన ఈ నటి.. ఇటీవల కాలంలో తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పలువురు యాక్టర్లు, రేడీయో జాకీలు, సినీ దర్శకులపై ఈ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా నెట్టింట పెద్ద దుమారమే లేపాయి. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో కల్పికా గురించి బజ్ ఏర్పడింది. తాజాగా మరో టాలీవుడ్ నటిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ప్రముఖ నటి ధన్యా బాలకృష్ణపై కల్పిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్యాకు రహస్యంగా వివాహం జరిగిందని, అయితే బయటకు మమాత్రం కానట్లే ఉంటుందని ఆరోపణలు చేసింది. లవ్ ఫెయిల్యూర్ మూవీ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈమె సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసిన కల్పిక.. అందులో ఈ వ్యాఖ్యలు చేసింది.

దీంతో కల్పిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా విశేషంగా ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. అయితే ఈ వీడియోను స్వల్ప వ్యవధిలోనే తొలగించింది. అయితే ఆమె మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించింది. ఆమెను ధన్యాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన తమిళ సూపర్‌స్టార్ ధనుష్.. తన ప్రభావంతో యూట్యూబ్ నుంచి వీడియోను తొలగించినట్లు స్పష్టం చేసింది.

కల్పిక గణేష్ ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌లో ప్రముఖల ఫొటోలను ఎలా మార్ఫింగ్ చేస్తారో కూడా వివరించింది. సోషల్ మీడియాలో వేదికగా పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ రావడంతో ఇటీవల కాలంలో ఆమెకు విపరీతంగా బజ్ ఏర్పడింది. పబ్లిసిటీ కోసమే కల్పిక ఇదంతా చేస్తుందంటూ కొంతమంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్