bahubali vs ponniyin selvan: పొన్నియన్ సెల్వన్ vs బాహుబలి-ఫ్యాన్స్ వార్-బాహుబలి రికార్డులు బ్రేక్ అంటూ పోస్ట్ లు-tamil fans making interesting comments compare ponniyin selvan with bahubali ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamil Fans Making Interesting Comments Compare Ponniyin Selvan With Bahubali

bahubali vs ponniyin selvan: పొన్నియన్ సెల్వన్ vs బాహుబలి-ఫ్యాన్స్ వార్-బాహుబలి రికార్డులు బ్రేక్ అంటూ పోస్ట్ లు

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 05:34 PM IST

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం పొన్నియన్ సెల్వన్ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్ కు అన్ని భాషల ఇండస్ట్రీల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాను కొందరు ఫ్యాన్స్ బాహుబలితో పోల్చుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్ (twitter)

కెరీర్ లో తొలిసారి చారిత్రక కథాంశంతో దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఐశ్వర్యారాయ్, విక్రమ్, జయంరవి, కార్తి, త్రిష లాంటి భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో టీజర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. చోళ సామ్రాజ్యపు కాలం నాటి నేటివిటీని కళ్లకు కట్టినట్లుగా సహజంగా మణిరత్నం ఆవిష్కరించిన తీరు పై ప్రశంసలు కురుస్తున్నాయి. యుద్ద సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ టీజర్ పై భాషాభేదాలకు అతీతంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం బాహుబలి సినిమాతో పొన్నియన్ సెల్వన్ టీజర్ ను కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి కి పోటీగా కోలీవుడ్ ఇచ్చే సమాధానం పొన్నియన్ సెల్వన్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. హలో బాహుబలి నీ రికార్డులు అన్నింటిని బ్రేక్ చేయడానికి మా పొన్నియన్ సెల్వన్ సినిమా వచ్చేస్తోంది అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. బాహుబలి ఎవరు..చోళులు వచ్చేస్తున్నారు. ఇకపై వారిదే అధిపత్యం అంటూ మరో అభిమాని ట్వీట్ చేశారు. కొందరు మాత్రం బాహుబలిలో పోలిస్తే పొన్నియన్ సెల్వన్ లో గ్రాఫిక్స్, విజువల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బాహుబలితో పోటికి పొన్నియన్ సెల్వన్ రాలేదంటూ చెబుతున్నారు. యావరేజ్ సినిమా ఇదంటూ పేర్కొంటున్నారు. ఈ ట్విట్టర్ వార్ ఆసక్తికరంగా మారింది. కాగా పొన్నియన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో పాటు హిందీలో రిలీజ్ కానుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్