Sushanth | సుశాంత్ ఓటీటీ ఎంట్రీ... తొలిసారి పోలీస్ పాత్ర‌లో...-sushanth plays police officer role in debut web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sushanth Plays Police Officer Role In Debut Web Series

Sushanth | సుశాంత్ ఓటీటీ ఎంట్రీ... తొలిసారి పోలీస్ పాత్ర‌లో...

Nelki Naresh HT Telugu
Mar 18, 2022 03:47 PM IST

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ కొన‌సాగుతోంది. విభిన్న‌మైన క‌థాంశాల‌తో రూపొందుతున్న వెబ్ సిరీస్ లు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతుండ‌టంతో వీటిలో న‌టించేందుకు అగ్ర‌న‌టీన‌టులు ఆస‌క్తిని చూపుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో సుశాంత్ కెరీర్ తొలిసారి ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

సుశాంత్
సుశాంత్ (twitter)

అక్కినేని కుటుంబం నుంచి హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు సుశాంత్‌. కాళిదాసు,క‌రెంట్,అడ్డాతో పాటు ప‌లు మాస్ సినిమాల్లో న‌టించారు. ఆ చిత్రాలు ఆయ‌న్ని హీరోగా నిల‌బెట్ట‌లేక‌పోయాయి. న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 2018 లో రూపొందిన ‘చి.ల‌.సౌ’తో కెరీర్ లో తొలి స‌క్సెస్ అందుకున్న సుశాంత్ ఇటీవ‌లే ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ అనే సినిమా చేశారు. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ‘రావ‌ణాసుర’సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 

తాజాగా సుశాంత్ ఓటీటీలోకి అరంగేట్రం చేస్తున్నారు. తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ పోలీస్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. శుక్ర‌వారం సుశాంత్ పుట్టినరోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ అతడి ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ జీప్ ముందు స్టైలిష్ గా నిల్చొని అతడు క‌నిపిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కు ల‌క్ష్మీసౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొల్లా ఏంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జ‌రుగుతోంది. జీ5 ఓటీటీ ద్వారా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

 

IPL_Entry_Point