Sridevi Shoban Babu Release Date: శ్రీదేవి శోభ‌న్‌బాబు మూవీ రిలీజ్ డేట్ ఇదే-sridevi shoban babu movie to hit screens on february 18 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sridevi Shoban Babu Release Date: శ్రీదేవి శోభ‌న్‌బాబు మూవీ రిలీజ్ డేట్ ఇదే

Sridevi Shoban Babu Release Date: శ్రీదేవి శోభ‌న్‌బాబు మూవీ రిలీజ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2023 09:00 PM IST

Sridevi Shoban Babu Release Date: చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోన్న శ్రీదేవి శోభ‌న్‌బాబు రిలీజ్ డేట్‌ను ఆదివారం అనౌన్స్ చేశారు. సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈసినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

శ్రీదేవి శోభ‌న్‌బాబు
శ్రీదేవి శోభ‌న్‌బాబు

Sridevi Shoban Babu Release Date: క‌ళ్యాణం క‌మ‌నీయం సినిమాతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సంతోష్ శోభ‌న్‌. తాజాగా నెల రోజుల గ్యాప్‌లోనే అత‌డి మ‌రో సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. శ్రీదేవి శోభ‌న్ బాబు మూవీ ఫిబ్ర‌వ‌రి 18న రిలీజ్ కానుంది. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఆమె భ‌ర్త విష్ణుప్ర‌సాద్ క‌లిసి ఈ సినిమాను నిర్మించారు.

ఆదివారం రిలీజ్‌డేట్‌ను అనౌన్స్‌చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ఇద‌ని సుస్మిత కొణిదెల చెప్పింది. త‌న మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా ఇద‌ని అన్నది. ఈ సినిమాలోని పాట‌ను ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్న‌ది. 1970 టైమ్ పీరియ‌డ్‌లో సాగే సినిమా ఇద‌ని సంతోష్ శోభ‌న్ అన్నాడు.

ఆడియెన్స్‌కు ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందిస్తుంద‌ని చెప్పాడు. ఈ సినిమాతో గౌరి జీ కిష‌న్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. ఆమె శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా సంతోష్ శోభ‌న్....శోభ‌న్ బాబు క్యారెక్ట‌ర్‌ను చేస్తోన్నాడు. శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను సినిమాలో చిన్ననాటి సమంత పాత్రలో గౌరి జి కిషన్ నటించింది.

శ్రీదేవి శోభ‌న్ బాబు సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నాడు. .గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన సుస్మిత కొణిదెల ఈ సినిమాతోనే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.

IPL_Entry_Point

టాపిక్