Mega 154 | మెగాస్టార్ సరసన శృతి హాసన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ-shruti haasan got a chance in chiranjeevi 154th movie as a heroin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shruti Haasan Got A Chance In Chiranjeevi 154th Movie As A Heroin

Mega 154 | మెగాస్టార్ సరసన శృతి హాసన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ

HT Telugu Desk HT Telugu
Mar 08, 2022 10:35 PM IST

వరుస చిత్రాలను అంగీకరిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న శృతిహాసన్ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చిరు 154వ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం తెచ్చుకుంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

చిరంజీవితో శృతి హాసన్
చిరంజీవితో శృతి హాసన్ (Twitter)

సినిమాలకు కాస్త గ్యాప్‌ తీసుకొని క్రాక్ చిత్రంతో ఘనమైన రీఎంట్రీని ఇచ్చింది శృతి హాసన్. అనంతరం వకీల్ సాబ్‌ చిత్రంలో పవన్ సరసన అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది. ప్రభాస్ సరసన సలార్‌లోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైంది.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వెల్‌కమ్ టూ శృతి హాసన్ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా 154వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

<p>డైరెక్టర్ బాబీతో శృతి హాసన్&nbsp;</p>
డైరెక్టర్ బాబీతో శృతి హాసన్&nbsp; (Twitter)

వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న శృతి హాసన్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్‌లో నటించనుంది. దీంతో పాటు నందమూరి నటసింహ బాలకృష్ణ-గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.

మరోపక్క మన మెగాస్టార్ ఇటీవలే కొరటాల శివ దర్శత్వంలో రానున్న ఆచార్య చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇంతలోనే బాబీ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

IPL_Entry_Point

టాపిక్