Kalyanam Kamaneeyam Pre release event: నేను సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది.. సంతోష్ శోభన్ స్పష్టం-santosh shoban happy about the movie kalyanam kamaneeyam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Santosh Shoban Happy About The Movie Kalyanam Kamaneeyam

Kalyanam Kamaneeyam Pre release event: నేను సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది.. సంతోష్ శోభన్ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Jan 12, 2023 09:57 PM IST

Kalyanam Kamaneeyam Pre release event: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం కళ్యాణం కమనీయం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగ్గా.. చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. సంతోష్ శోభన్ సహా చిత్రబృందం పాల్గొన్నారు.

కళ్యాణం కమనీయం ప్రీ రిలీజ్ ఈవెంట్
కళ్యాణం కమనీయం ప్రీ రిలీజ్ ఈవెంట్

Kalyanam Kamaneeyam Pre release event: యువహీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ హీరోయిన్లునగా నటించిన తాజా చిత్రం కళ్యాణం కమనీయం. ఈ సినిమాను యూవీ కాన్సెప్ట పతాకంపై నిర్మించారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకరైన కథనాలతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం.

ఇందులో భాగంగా ముందుగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. "ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేని సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ గారి సినిమాలతో సంక్రాంతికి మళ్లీ ఓ కళ వచ్చింది. వాళ్ల సినిమాతో పాటు మా చిత్రానికి కూడా ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే కూడా ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా మొత్తగా అనిల్‌కే దక్కుతుంది. ప్రియా చాలా బాగా చేసింది. చిత్ర సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు." అని సంతోష్ శోభన్ తెలిపాడు.

అనంతరం హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ.. తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా అని, ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉందని, ఇదే సమయంలో భయంగానూ ఉందని తెలిపింది. నన్న ఘనంగా లాంచ్ చేసిన యూవీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని, ఇందులో శృతి అనే పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో శృతి పాత్ర మాదిరిగానే తన పాత్ర కూడా ఉంటుందని స్పష్టం చేసింది.

అనంతరం దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మనం జెన్యూన్‌గా ఓ కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకు హెల్ప్ చేస్తుందని తాను నమ్ముతానని ఆయన అన్నారు. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయంలో ఉన్నాయని తెలిపారు.

సంతోష్ శోభన్ సరసన ఈ చిత్రం ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేసింది. అనిల్ కుమార్ ఆళ్ల చిత్రానికి దర్శకత్వం వహించారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్