Ramcharan-Keerthy| 'మగధీర'తో 'మహానటి' నాటు స్టెప్పులు.. వీడియో వైరల్!-ramcharan and keerthy suresh dance for naatu naatu song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramcharan-keerthy| 'మగధీర'తో 'మహానటి' నాటు స్టెప్పులు.. వీడియో వైరల్!

Ramcharan-Keerthy| 'మగధీర'తో 'మహానటి' నాటు స్టెప్పులు.. వీడియో వైరల్!

Maragani Govardhan HT Telugu
Jan 27, 2022 09:20 AM IST

గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్, కీర్తి సురేష్ సందడి చేశారు. ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు, నాటు సాంగ్ కు కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్-కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్పులు
రామ్ చరణ్-కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్పులు (twitter)

ఎన్టీఆర్, రామ్‍‌చరణ్ కలయికలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు, నాటు పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్‌లో తారక్, చరణ్ అదిరిపోయే స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పాట స్టెప్పులను అనుకరిస్తూ రీల్స్, కవర్ సాంగ్స్‌ను రూపొందించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సాంగ్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది. సెలబ్రెటీలు సైతం ఈ స్టెప్పులను అనుకరించారు. తాజాగా కీర్తి సురేష్ కూడా నాటు, నాటు స్టెప్పులతో అలరించింది. అది కూడా రామ్‌చరణ్‌తో కలిసి నర్తించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్(Viral) అవుతోంది.

వివరాల్లోకి వెళ్లే గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాపవర్‌స్టార్‌తో కలిసి కీర్తి సూరేష్ నాటు స్టెప్పులేసింది. తనతో కలిసి నాటు నాటు పాటకు నర్తించాలని కీర్తి కోరగా.. రామ్‌చరణ్ నవ్వుతూ ఆమెతో కలిసి నర్తించారు. ఒకే వేదికపై ఇద్దరూ స్టెప్పులేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

ఇదిలా గుడ్ లక్ సఖీ చిత్రాన్ని హైదరాబాద్ బ్లూస్ ఫేమ్ నగేష్ కుకునూర్ తెరక్కించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉండగా.. ఆయనకు కోరనా సోకడంతో చిరు స్థానంలో రామ్‌చరణ్ హాజరై చితృబృందానికి విషెస్ చెప్పారు. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడగా చివరకు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగితే మార్చి 18వ విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ఇటీవలే స్పష్టం చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర పోషించగా.. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఆలియా భట్, అజయ్‌దేవగణ్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం