Priyanka Chopra | ముఖానికి గాయాలతో ప్రియాంకా చోప్రా.. అసలేం జరిగింది?-priyanka chopra shared photo with bruised face on instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Priyanka Chopra Shared Photo With Bruised Face On Instagram

Priyanka Chopra | ముఖానికి గాయాలతో ప్రియాంకా చోప్రా.. అసలేం జరిగింది?

HT Telugu Desk HT Telugu
May 18, 2022 07:58 PM IST

ప్రియాంకా చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారిపోయింది. ఆ ఫొటోలో ప్రియాంకా ముఖంపై గాయాలతో కనిపించింది. ఇది చూసి అభిమానులు ఏం జరిగిందంటూ ఆరా తీశారు.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా (Instagram)

ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్‌లో కొన్నాళ్లపాటు టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచి తర్వాత హాలీవుడ్‌ వైపు చూసి అక్కడే నిక్‌ జొనాస్‌ను పెళ్లి చేసుకొని సెటిలైంది. ఇప్పుడు తొలిసారి సిటడెల్‌ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌ షూటింగ్‌లోనే ఆమె ప్రస్తుతం బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో చూసి అభిమానులు షాక్‌ తిన్నారు.

ఆ ఫొటోలో ప్రియాంకా ముఖంపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పెదవులు, ముక్కు కింది భాగంలో రక్తపు మరకలు కనిపించాయి. ఈ ఫొటో షేర్‌ చేస్తూ.. మీరు పని చేసే చోట కూడా ఇలాగే కష్టపడుతున్నారా అనే క్యాప్షన్‌ రాసింది. ఇది చూసి ఆందోళన చెందిన ఫ్యాన్స్‌ ఏమైందంటూ ఆరా తీశారు. ఆమె షూటింగ్‌ సెట్స్‌లోనే గాయపడిందేమో అని వాళ్లు భావించారు.

ఏమైంది బాగానే ఉన్నావా అని ఒకరు.. కాస్త జాగ్రత్తగా ఉండు అని మరొకరు.. నువ్వు నిజంగా గాయపడ్డావని అనుకున్నా అని ఇంకొకరు ఇలా వేల కొద్దీ కామెంట్స్‌ వచ్చాయి. నిజానికి ఆమె సిటడెల్‌ వెబ్‌సిరీస్‌ సెట్స్‌లోనే మేకప్‌తో అలా ఫొటోలకు పోజులిచ్చింది. సిటడెల్‌ ఒక సైన్స్‌ ఫిక్షన్‌ సిరీస్‌. ఈ మధ్యే ఈ సిరీస్‌ కోసం మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టింది.

గతేడాది డిసెంబర్‌లోనూ లండన్‌ షెడ్యూల్‌ నడుస్తున్న సమయంలో సిటడెల్‌ సెట్స్‌లోని ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. అప్పుడు కూడా ఇలాగే గాయాలైనట్లుగా ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేయడం విశేషం. ఈ సిరీస్‌తోపాటు ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో జీ లే జరా, హాలీవుడ్‌లో ఇట్స్‌ ఆల్‌ కమింగ్‌ బ్యాక్‌ టు మిలాంటి మూవీస్‌ చేస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్