Nayanthara Twin Babies Names: త‌న క‌వ‌ల పిల్ల‌ల పేర్లు రివీల్ చేసిన న‌య‌న‌తార - పాన్ ఇండియ‌న్ నేమ్స్ అంటూ కామెంట్స్‌-nayanthara reveals her twin babies names ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nayanthara Reveals Her Twin Babies Names

Nayanthara Twin Babies Names: త‌న క‌వ‌ల పిల్ల‌ల పేర్లు రివీల్ చేసిన న‌య‌న‌తార - పాన్ ఇండియ‌న్ నేమ్స్ అంటూ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 03, 2023 08:05 AM IST

Nayanthara Twin Babies Names: త‌మ క‌వ‌ల చిన్నారుల‌కు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ పేర్లు పెట్టారు. ఈ చిన్నారుల పేర్ల‌ను ఓ ఈవెంట్‌లో న‌య‌న‌తార రివీల్ చేసింది.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్
న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్

Nayanthara Twin Babies Names: న‌య‌న‌తార‌, విఘ్నేష్‌శివ‌న్ గ‌త ఏడాది త‌ల్లిదండ్రులుగా మారిన సంగ‌తి తెలిసిందే. జూన్ నెల‌లో వివాహ‌బంధంతో ఒక్క‌టైనా న‌య‌న్‌, విఘ్నేష్‌ అక్టోబ‌ర్‌లో స‌రోగ‌సీ విధానం ద్వారా తాము త‌ల్లిదండ్రులుగా మారిన‌ట్లు ప్ర‌క‌టించారు. క‌వ‌ల పిల్ల‌లు పుట్టిన‌ట్లు అభిమానుల‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నారు.

కాగా త‌మ క‌వ‌ల చిన్నారుల‌కు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివ‌న్‌, ఉల‌గ్ దైవిక్ ఎన్ శివ‌న్‌గా న‌యన్‌, విఘ్నేష్ పేర్లు పెట్టారు. త‌న కుమారుల పేర్ల‌ను ఇటీవ‌ల ఓ ఈవెంట్‌లో న‌య‌న‌తార రివీల్ చేసింది. ముద్దుగా వారిని ఉయిర్‌, ఉల‌గ్ అని పిలుచుకుంటున్న‌ట్లు తెలిపింది. త‌మ ట్విన్ బేబీస్‌కు న‌య‌న్‌, విఘ్నేష్ డిఫ‌రెంట్‌గా పెట్టిన ఈ పేర్ల‌ను ప‌ల‌క‌డ‌మే క‌ష్టంగా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. పాన్ ఇండియ‌న్ నేమ్స్‌ ఇవి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

పెళ్లైనా నాలుగు నెల‌ల్లోనే వీరు త‌ల్లిదండ్రులుగా మార‌డం వివాదానికి దారితీసింది.పెళ్లికి ముందే వీరు స‌రోగ‌సీ ప్రాసెస్ మొద‌లుపెట్టి నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించారంటూ న‌య‌న్‌, విఘ్నేష్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాము ఆరేళ్ల క్రిత‌మే పెళ్లిచేసుకున్నామ‌ని, చ‌ట్ట ప్ర‌కార‌మే స‌రోగ‌సీ ప్రాసెస్ మొద‌లుపెట్టామ‌ని న‌య‌న్‌, విఘ్నేష్ ఆధారాలు స‌మ‌ర్పించ‌డంతో ఈ వివాదానికి తెర‌ప‌డింది.

కాగా ఓ వైపు మాతృత్వ బంధాన్ని ఆస్వాదిస్తూనే సినిమాల‌పై దృష్టిసారిస్తోంది న‌య‌న‌తార‌. ఈ ఏడాది ఆమె షారుఖ్‌ఖాన్ జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. జూన్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా జ‌వాన్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్‌లో మ‌రో మూడు సినిమాలు చేస్తోంది న‌య‌న‌తార‌.

IPL_Entry_Point

టాపిక్