Bigg Boss 6 Telugu Trp Rating: బిగ్‌బాస్ 6 ఫస్ట్ ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బిగ్‌బాస్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్-nagarjuna hosted bigg boss 6 telugu first episode gets lowest trp rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nagarjuna Hosted Bigg Boss 6 Telugu First Episode Gets Lowest Trp Rating

Bigg Boss 6 Telugu Trp Rating: బిగ్‌బాస్ 6 ఫస్ట్ ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బిగ్‌బాస్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్

Nelki Naresh Kumar HT Telugu
Sep 16, 2022 06:30 AM IST

Bigg Boss 6 Telugu Trp Rating: ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 6 మొదలైంది. ఈ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ కు లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. గత సీజన్స్ తో పోలిస్తే చాలా తక్కువ టీఆర్‌పీ రేటింగ్ కావడం గమనార్హం.

నాగార్జున
నాగార్జున (Twitter)

Bigg Boss 6 Telugu Trp Rating: తెలుగులో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ రియాలిటీషోస్‌ల‌లో బిగ్‌బాస్ ఒక‌టిగా నిలిచింది. ఐదు సీజ‌న్స్‌తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బిగ్‌బాస్ అంతులేని వినోదాన్ని పంచింది. ఇటీవ‌లే బిగ్‌బాస్ ఆర‌వ సీజ‌న్ మొద‌లైంది. మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున (Nagarjuna) మ‌రోసారి ఆరవ సీజన్ కోసం మరోసారి ఆ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ షోకు ఇప్ప‌టికే ప‌ది ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్న‌ది. తొలిరోజు నుంచే కంటెస్టెంట్స్ ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయిస్తూ ఆట‌లో దూసుకుపోతున్నారు. కాగా బిగ్‌బాస్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు ఊహించ‌ని రీతిలో లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.ఓపెనింగ్ డే ఎపిసోడ్ లో రణ్ భీర్ కపూర్, అలియాభట్ గెస్ట్ లుగా వచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. అయినా కేవ‌లం 8.86 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే సాధించింది. ఆరు సీజ‌న్స్‌లో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు వ‌చ్చిన లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాలుగోసీజ‌న్ ఫస్ట్ ఎపిసోడ్ హ‌య్యెస్ట్‌గా 18.5 టీఆర్‌పీ రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఫ‌స్ట్ ఎపిసోడ్ 17.9 టీఆర్‌ప్ రేటింగ్ ద‌క్కించుకున్న‌ది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ 16.8 టీఆర్‌పీ రేటింగ్ సాధించింది. అందులో స‌గం మాత్ర‌మే సీజ‌న్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కు రావ‌డం షాక్‌కు గురిచేస్తోంది.

జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌ని కంటెస్టెంట్స్ కావ‌డం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కు, సీజన్ 6 కు మధ్య గ్యాప్ ఎక్కువగా లేకపోవడమే టీఆర్‌పీ రేటింగ్ తగ్గడానికి కారణమని చెబుతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 6లో రేవంత్‌, శ్రీహాన్, కీర్తిభ‌ట్‌, సుదీప‌, బాలాదిత్య‌, సింగ‌ర్ రేవంత్‌, ఆదిరెడ్డి, రాజ‌శేఖ‌ర్‌, ఆర్జే సూర్య‌, అభిన‌య‌శ్రీ, ఫైమా, చ‌లాకీ చంటి, అర్జున్ క‌ళ్యాణ్‌, రోహిత్ మ‌రీనా, ఇనాయా సుల్తానా, గీతూ రాయ‌ల్, షానీ సాల్మ‌న్, నేహా కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. తొలి వారంలో ఎలిమినేషన్ నుంచి నుంచి మిన‌హాయింపు ఇచ్చాడు బిగ్ బాస్.

IPL_Entry_Point