Naga Chaitanya: శోభిత దూళిపాళ్ల‌తో డేటింగ్ రూమ‌ర్స్‌పై ఫ‌న్నీగా స్పందించిన నాగ‌చైత‌న్య‌-naga chaitanya reacts to dating rumors with sobhita dhulipala ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya Reacts To Dating Rumors With Sobhita Dhulipala

Naga Chaitanya: శోభిత దూళిపాళ్ల‌తో డేటింగ్ రూమ‌ర్స్‌పై ఫ‌న్నీగా స్పందించిన నాగ‌చైత‌న్య‌

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 03:59 PM IST

మేజ‌ర్ (Major) సినిమా హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌ (Sobhita Dhulipala)తో నాగ‌చైత‌న్య(Naga Chaitanya) ప్రేమ‌లో ఉన్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమ‌ర్స్ పై నాగ‌చైత‌న్య స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే...

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య (twitter)

లాల్‌సిండ్‌చ‌డ్డా సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్నారు నాగ‌చైత‌న్య‌. ప‌లు చారిత్ర‌క సంఘ‌ట‌న‌ల‌కు సాక్షిగా నిలిచిన ఓ వ్య‌క్తి జీవ‌న ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు. హాలీవుడ్‌లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 11న హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నాగ‌చైత‌న్య బిజీగా ఉన్నారు. కాగా మేజ‌ర్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌తో నాగ‌చైత‌న్య ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మేజ‌ర్స్ సినిమా రిలీజ్ స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన శోభిత దూళిపాళ్ల‌ను నాగ‌చైత‌న్య ప‌లుమార్లు క‌లిసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ డేటింగ్ రూమ‌ర్స్‌పై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగ‌చైత‌న్య తాజాగా స్పందించారు.

ఓ ఇంట‌ర్వ్యూలో శోభిత పేరు విన‌గానే మీకుగుర్తొచ్చేది ఏది అంటూ అడిగిన ప్ర‌శ్న కు చిరున‌వ్వు అంటూ ఫ‌న్నీగా ఆన్స‌ర్ చెప్పాడు నాగచైతన్య. ఆ పేరు విన‌గానే త‌న పెదాల‌పై న‌వ్వు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంద‌ని, అంత‌కుమించి మరేం గుర్తురాదంటూ పేర్కొన్నాడు. అత‌డి స‌మాధానం వెనుక ఉన్న ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రూమర్స్ ఏవీ క్రియేట్ కాకుండా చాలా తెలివిగా చైతూ ఈ ప్రశ్నకు సమాధాచం ఇచ్చాడు. లాల్‌సింగ్‌చ‌డ్డా హిట్ అయితే భ‌విష్య‌త్తులో బాలీవుడ్‌లో మ‌రిన్ని సినిమాలు చేస్తాన‌ని అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం తెలుగులో మూడు సినిమాల్ని అంగీక‌రించాడు.

IPL_Entry_Point