Bigg Boss 6 Telugu Elimination: భార్యభర్తలను విడగొట్టిన బిగ్‌బాస్ - మరీనా ఎలిమినేట్
బిగ్‌బాస్ నుంచి ఈ వారం మరీనా ఎలిమినేట్ అయ్యింది. భార్య ఎలిమినేట్ కావడంతో రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీని బిగ్‌బాస్ హౌజ్‌లో చేసుకోవాలనే మరీనా కల తీరలేదు.
బిగ్‌బాస్ తెలుగు 11వ వారంలో మరీనా ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్‌లోకి భర్త రోహిత్‌తో కలిసి జంటగా అడుగుపెట్టిన మరీనా హౌజ్ నుంచి ఒంటరిగా వెళ్లిపోయింది. భార్యభర్తలను బిగ్‌బాస్ విడదీశాడు. తన ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీని బిగ్‌బాస్ హౌజ్‌లో జరుపుకోవాలనే మరీనా కల తీరకుండా చేశాడు. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌ను ఎలిమినేషన్‌తో ప్రారంభించాడు నాగార్జున. బ్యాట్ టాస్క్‌లో రేవంత్, కీర్తి సేఫ్ అయ్యారు.
బాటమ్ ఫైవ్ వీళ్లే...
ఆ తర్వాత బిగ్‌బాస్‌లో టాప్ ఫైవ్, బాటమ్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాలని హౌజ్‌మేట్స్‌ను కోరాడు నాగార్జున. తొలుత ఆదిరెడ్డిని కన్ఫేషన్ రూమ్‌కు పిలించాడు. బాటమ్ ఫైవ్ ఎవరో చెప్పాలని అన్నాడు. బాటమ్ ఫైవ్‌గా మరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనాయా , టాప్ ఫైవ్‌గా రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమాతో పాటు తన పేరును కూడా చెప్పుకున్నాడు.
ఆ తర్వాత ఇనాయా... రాజ్, శ్రీసత్య, మరీనా, రోహిత్, ఆదిరెడ్డిలను బాటమ్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా పేర్కొన్నాది. టాప్ ఫైవ్‌గా తనతో పాటు రేవంత్, శ్రీహాన్, ఫైమా, కీర్తి పేర్లు చెప్పింది. ఆ తర్వాత కీర్తిని కన్ఫేషన్‌రూమ్‌కు పిలిచాడు నాగార్జున. శ్రీసత్య, మరీనా, రాజ్, ఆదిరెడ్డి, శ్రీహాన్ పేర్లను బాటమ్ కంటెస్టెంట్స్‌గా పేర్కొన్నది. రాజ్ వంతు రాగా మరీనా, రోహిత్, ఇనాయా, శ్రీహాన్, ఆదిరెడ్డి పేరు చెప్పాడు.
టాప్ ఫైవ్ వీరే...
ఆ తర్వాత ఫైమా వంతు వచ్చింది. రోహిత్, మరీనా, ఇనాయా, కీర్తి రాజ్ పేర్లను బాటమ్ ఫైమ్‌గా పేర్కొన్నది. బాటమ్ ఫైవ్‌గా మరీనా, కీర్తి, ఇనాయా, రాజ్ రోహిత్ పేర్లను శ్రీసత్య చెప్పింది. మరీనా, రాజ్, కీర్తి, రోహిత్, ఇనాయా పేర్లను రేవంత్ చెప్పాడు. టోటల్‌గా బాటమ్ ఫైవ్‌లో ఇనాయా, కీర్తి, రాజ్, మరీనా, రోహిత్ నిలిచారు. టాప్ ఫైవ్‌లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి నిలిచారు. అందరూ రోహిత్; మరీనా ఆటతీరు యాక్టివ్‌గా లేదని, ఇనాయా ప్రతిసారి మాట జారుతోందని అన్నారు.
మరీనా ఎలిమినేట్
ఆ తర్వాత ఇచ్చిన లారీ టాస్క్‌లో శ్రీసత్య సేఫ్ అయ్యింది. తర్వాత హౌజ్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా డివైడ్ చేసిన నాగార్జున బోన్ గేమ్ ఆడించాడు. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్‌లో శ్రీసత్య సేఫ్ అయ్యింది.
చివరగా నామినేషన్స్‌లో ఇనాయా, మరీనా నిలిచారు. ఫొటో టాస్క్‌లో మరీనా ఎలిమినేట్ అయ్యింది. వైఫ్ మరీనా ఎలిమినేట్ అవడంతో రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.హజ్‌లో ప్యూర్ ఎవరు ,అన్ ప్యూర్ ఎవరో చెప్పాలని మరీనాను నాగార్జున కోరాడు. ఇందులో రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్, రాజ్ పేరు చెప్పాడు. అన్‌ప్యూర్‌గా ఇనాయా, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా పేరు చెప్పింది.