Kalyanam Kamaneeyam OTT Release Date: భారీ బడ్జెట్ సినిమాలకు పోటీగా రిలీజైన చిన్న సినిమా కళ్యాణం కమనీయం ఓటీటీలోకి రాబోతున్నది. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ,రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు అనీల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించారు.,నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిలబడుతుందనే కాన్సెప్ట్‌తో దర్శకుడు అనిల్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శివ అనే నిరుద్యోగిగా సంతోష్ శోభన్ కనిపించగా శృతి అనే సాప్ట్‌వేర్ ఉద్యోగిగా ప్రియా భవానీ శంకర్ నటించింది. ,భార్య బలవంతంతో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన శివ ఎదుర్కొన్న ఇబ్బందులను వినోదాత్మక పంథాలో ఈ సినిమాలో ఆవిష్కరించారు.,వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డికి పోటీగా సంక్రాంతికి కళ్యాణం కమనీయం సినిమా థియేటర్లలో విడుదలైంది. రొటీన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అందుకే థియేటర్లలో రిలీజైన ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమాను ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలిసింది.