Janhvi Kapoor Shikhar Pahariya: బాయ్‌ఫ్రెండ్‌తో తిరుమలలో జాన్వీకపూర్ ప్రత్యేక పూజలు - వీడియో వైరల్
Janhvi Kapoor Shikhar Pahariya: ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుపతి దేవాలయాన్ని సందర్శించింది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్. తిరుమలలో వీరిద్దరు కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Janhvi Kapoor Shikhar Pahariya: బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్‌కు దైవభక్తి ఎక్కువే. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా తరచుగా వీలుచూసుకొని తిరుమల టెంపుల్‌ను దర్శిస్తుంటుంది. సోమవారం జాన్వీకపూర్ మరోసారి తిరుపతి వచ్చింది. తన సోదరి ఖుషీకపూర్‌తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. జాన్వీ కపూర్‌తో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా తిరుమల వచ్చాడు.
సోమవారం జాన్వీకపూర్ తిరుమల సందర్భించిన వీడియోల్లో శిఖర్ పహారియా కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది. జాన్వీ కపూర్ పింక్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లెహంగా ధరించి కనిపించగా శిఖర్ దోతీ కట్టుకొని దర్శనమిచ్చాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంతి సుశీల్ కుమార్ షిండే మనవడైన శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
గతంలో పలు సినిమా వేడుకల్లో జాన్వీతో కలిసి కనిపించాడు శిఖర్ పహారియా.వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి జాన్వీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసునని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ ఈవెంట్‌లో బోనీ కపూర్‌తో కలిసి శిఖర్ కనిపించాడు. అయితే తమ ప్రేమ వార్తలపై ఇప్పటివరకు జాన్వీ మాత్రం పెదవి విప్పలేదు.
జాన్వీ, శిఖర్ తిరుమలలో జంటగా కనిపించడంతో వీరి ప్రేమ వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా టాలీవుడ్‌లో అరంగేట్రం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోన్న జాన్వీకపూర్ ఇటీవలే ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ త్వరలోనే అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. మరోవైపు బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీకపూర్.
టాపిక్