Janhvi on NTR: ఎన్టీఆర్‌తో పని చేయాలని ప్రతి రోజూ దేవుడిని ప్రార్థించేదాన్ని.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు-janhvi kapoor says i prayed every day for working with ntr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Janhvi Kapoor Says I Prayed Every Day For Working With Ntr

Janhvi on NTR: ఎన్టీఆర్‌తో పని చేయాలని ప్రతి రోజూ దేవుడిని ప్రార్థించేదాన్ని.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Mar 19, 2023 08:06 PM IST

Janhvi on NTR: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్30లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆఫర్ దక్కించుకునేందుకు రోజూ దేవుడిని ప్రార్థించేదాన్ననని ఈ ముద్దుగుమ్మ తెలిపింది.

జాన్వీ-తారక్
జాన్వీ-తారక్

Janhvi on NTR: శ్రీదేవి ముద్దుల తనయగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఎట్టకేలకు తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్‌టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న NTR30లో నటించనుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తన ఫేవరెట్ హీరో అని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తాజాగా టాలీవుడ్‌లో అవకాశం రావడం పట్ల జాన్వీ కపూర్ స్పందించింది. ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

"జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే బాగుండని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ప్రతిరోజూ డైరెక్టర్‌కు మెసేజ్ చేసేదాన్ని. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించడం ఓ కల. నేను ఇటీవల ఆర్ఆర్ఆర్‌ సినిమాను మళ్లీ చూశాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలోనే అతిపెద్ద ఆనందాల్లో ఒకటి" అని జాన్వీ స్పష్టం చేసింది.

తారక్‌తో వర్క్ చేయాలని ప్రతి రోజూ దేవుడిని ప్రార్థించేదాన్ని అని జాన్వీ కపూర్ చెప్పింది. "తారక్‌తో కలిసి పనిచేయడం నా కల. ఇందుకోసం ప్రతిరోజూ నేను దేవుడిని ప్రార్థించాను. ఆయనతో కలిసి పనిచేయాలని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఈ విధంగా సినిమా ఆఫర్ కోసం చూడటం ఇదే మొదటి సారి. నమ్మితే మీరు ఎప్పుడు సానుకూలంగా ఉండటం, పనిచేయడం నేర్చుకున్నాను." అని జాన్వీ తెలిపింది.

ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

IPL_Entry_Point

టాపిక్