Hollywood | షాకింగ్ క్లైమాక్స్ తో ఎండ్ అయ్యే హాలీవుడ్ సినిమాలు..-hollywood movies ending with shocking twist ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hollywood Movies Ending With Shocking Twist

Hollywood | షాకింగ్ క్లైమాక్స్ తో ఎండ్ అయ్యే హాలీవుడ్ సినిమాలు..

Nelki Naresh HT Telugu
Mar 05, 2022 02:39 PM IST

ఊహ‌లు, అంచ‌నాల‌కు అంద‌కుండా ఓ సినిమా ఎండ్ అయితే ఆ థ్రిల్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేము. అలా ఎగ్జైటింగ్‌కు లోను చేస్తూ ఎండ్ అయ్యే సినిమాలు హాలీవుడ్‌లో చాలా వ‌చ్చాయి. వాటిలో కొన్ని అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి..

షట్టర్ ఐస్ లాండ్, అరైవల్
షట్టర్ ఐస్ లాండ్, అరైవల్ (twitter)

ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌లు ఎప్పుడూ ప్రేక్ష‌కుడి ఊహ‌కు అంద‌కుండా సాగాలి. ఎవ‌రూ ఎక్స్‌పెక్ట్‌ చేయ‌ని ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో క‌థ‌ల్ని రాసుకోవాలి. అప్పుడే స‌క్సెస్ ల‌ను అందుకునే అవ‌కాశం ఉంటుంది. అలాంటి సినిమాలే ప్రేక్ష‌కుల‌కు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. హాలీవుడ్ లో ఊహించ‌ని మ‌లుపుల‌తో ఎండ్ అయ్యే సినిమాలు చాలా వ‌చ్చాయి. వాటిలో కొన్ని విడుద‌లై ప‌దేళ్లు దాటినా కూడా ఇప్ప‌టికీ ఆ సినిమాల‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచిపోయిన ఆ సినిమాల్ని ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్ట‌వు. అమెజాన్‌, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల‌లో అందుబాటులో ఉన్న ఆ సినిమాల్ని వీలు కుదిరితే చూసేయండి..

ఫైట్ క్ల‌బ్‌- netflix

1999లో డేవిడ్ ఫించ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘ఫైట్ క్ల‌బ్’ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో క‌ల్ట్ క్లాసిక్ ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా క్లైమాక్స్ లో ద‌ర్శ‌కుడు డేవిడ్ ఫించ‌ర్ ఇచ్చే ట్విస్ట్ మాములుగా ఉండ‌దు. ఆ ట్విస్ట్ చూసిన త‌ర్వాత మాట‌లు రావు. క్యాపిట‌లిజం, క‌న్జ్యూమ‌రిజం మ‌ధ్య న‌లిగిపోతున్న అమెరిక‌న్ స‌మాజాన్ని డిఫ‌రెంట్ కోణంలో ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించారు. Brad Pitt, Edward Norton ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. తొలుత డేవిడ్ ఫించ‌ర్ చెప్పిన ఈ క‌థ‌తో సినిమాను నిర్మించ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేద‌ట‌. విడుద‌లైన త‌ర్వాత కూడా సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న‌ది. అనంతర కాలంలో గొప్ప సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఐఎమ్‌డీబీ 8.8 రేటింగ్ ఉంది.

Arrival (film)-Netflix

సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా క‌థాంశంతో 2016లో Denis Villeneuve ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ను ద‌క్కించుకున్న‌ది. క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల తలెత్తే అన‌ర్థాల‌ను సందేశాత్మ‌కంగా చూపించే సినిమా ఇది. క్లైమాక్స్ సీన్ తోనే ఈ సినిమాను మొద‌ల‌య్యే విధానం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌జెంట్‌, ఫ్యూచ‌ర్ లను చూపిస్తూ సాగే స్ర్కీన్‌ప్లే , ట్విస్ట్ ఊహ‌ల‌కు అంద‌కుండా సాగుతాయి. ఐఎమ్‌డీబీ 7.9 రేటింగ్ ఇచ్చారు. Amy Adams, Jeremy Renner ఇద్ద‌రి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

Incendies-amazon prime

2010లో వార్ డ్రామా క‌థాంశంతో రూపొందిన ఈ కెనడియ‌న్ సినిమా ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల‌ను అందుకున్న‌ది. ప‌శ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత ప‌రిస్థితుల‌ను, మ‌తోన్మాదం, యుద్ధం కార‌ణంగా ప్ర‌జా జీవితం ఎలా అస్త‌వ్య‌స్త‌మైందో రియ‌లిస్టిక్ ద‌ర్శ‌కుడు Denis Villeneuve ఈ సినిమాలో చూపించారు. పుట్టిన వెంటనే దూరమైన తన కొడుకును క‌లుసుకోవ‌డానికి ఓ త‌ల్లి ప‌డే ఆరాటం, తండ్రి తో పాటు సోద‌రుడు ఆచూకీ కోసం ఓ యువతి ప‌డే త‌ప‌న..రెండు ప్రయాణాల్ని స‌మాంత‌రంగా చూపిస్తూ డిఫ‌రెంట్ స్ర్కీన్‌ప్లేతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ ను ఎమోష‌న‌ల్ ట్విస్ట్ తో ద‌ర్శ‌కుడు ముగించారు. ఆ సీన్ క‌న్నీళ్ల‌ను పెట్టిస్తుంది. నిదానంగా సాగే డ్రామా సినిమా ఇది. ఓపిక తెచ్చుకొని చూస్తే చాలా రోజుల పాటు వెంటాడుతూనే ఉంటుంది.

Shutter Island -Netflix

హాలీవుడ్ అగ్ర హీరో Leonardo DiCaprio కెరీర్ లో బెస్ట్ సినిమాల్లో ఇది ఒక‌టి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ స్టోరీతో ద‌ర్శ‌కుడు Martin Scorsese ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఓ ఐలాండ్ లో ఉండే మెంట‌ల్ హాస్పిట‌ల్ నుంచి త‌ప్పించుకుపోయిన లేడీ క్రిమిన‌ల్ గురించి అన్వేషించే ఇద్ద‌రు పోలీస్ ఆఫీస‌ర్స్ క‌థ ఇది. ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు ఎంగేజింగ్ గా సాగే ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం థ్రిల్ కు గురిచేస్తుంది. ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ ఇచ్చారు.

The Others (2001 film)-netflix

నికోల్ కిడ్‌మ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన హార‌ర్ సినిమా ఇది. ఓ మ‌హాల్ లో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సించే త‌ల్లికి ఎదురైన అనూహ్య ప‌రిణామాల‌తో థ్రిల్లింగ్ గా ఈ సినిమా సాగుతుంది. ఫ‌స్ట్ సీన్ నుంచి లాస్ట్ వ‌ర‌కు చూసిన సినిమా ఒకెత్తు అయితే క్లైమాక్స్ ట్విస్ట్ తో మరో ఎత్తుగా ఉంటుంది. ఆ సీన్ తో అప్పటివరకు అర్థం చేసుకున్న సినిమా మొత్తం మారిపోతుంది. హార‌ర్ సినిమాల్ని చూసే వారిని మెప్పిస్తుంది.

వీటితో పాటు ఊహించని ట్విస్ట్ తో ప్రేక్షకుల్లో థ్రిల్ చేసే సినిమాల్లో ది ఎనిమీ (అమెజాన్ ప్రైమ్‌), గోన్ గ‌ర్ల్ (నెట్ ఫ్లిక్స్‌) ది మిస్ట్ (నెట్ ఫ్లిక్స్‌)యూసువ‌ల్ స‌స్సెక్ట్స్ (జియో సినిమా), డానీ డార్కో (అమెజాన్ ప్రైమ్‌) సినిమాలు నిలుస్తాయి. టైమ్ దొరికితే ఈ సినిమాల్ని చూడండి.

IPL_Entry_Point