Galatta Geetu Shocking Commnets in Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6లో మొదటి వారం నుంచి గోల మొదలైంది. సాధారణంగా ఈ షోలో కాస్త శృతిమించి డబుల్ మీనింగ్ డైలాగులు, ప్రేమాయణాలు నడుస్తాయి. అయితే అది కూడా షో మంచి రసవత్తరంగా సాగుతున్న మూడు, నాలుగు వారాల తర్వాత. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఫస్ట్ వీక్ నుంచే కంటెస్టెంట్ల మధ్య వైరం మొదలవడం అటుంచితే.. అనవసరంగా గొడవలు పడటం, ఏదో నిరూపించుకోవాలని ట్రై చేయడం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ యూట్యూబర్, నటి గలాట గీతూ రచ్చ మాములుగా లేదు.,శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో గలాటా గీతూ రచ్చ ఓ రేంజ్‌లో సాగింది. బాలాదిత్యకు దగ్గరగా కూర్చున్న గీతూ.. అతడి ముఖానికి దగ్గరాగా కాలు మీదు కాలేసుకుని ఊపుతూ కనిపించింది. కాస్త సవ్యంగా కూర్చో.. ఆ కాళ్లు ముఖంపై పెట్టి ఊపడం బాలేదు అని చాలా పద్దతిగా చెప్పాడు. ఏ నీ మూతిలో పెట్టి ఊపినానా? అని వెటకారంగా, చిరాకుగా మాట్లాడింది. ఎవరి మూతిలో పెట్టి ఊపినా తప్పే అంటూ బాలాదిత్య మర్యాదగానే మందలిస్తూ చెప్పాడు. సరే అలా చేయనని చెప్పినప్పటికీ.. గీతూ వినేలా అనిపించలేదు.,అనంతరం కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో గీతూ నానా యాగీ చేసింది. బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌లో ఏకంగా నెంబర్స్ తీసుకుని టీషర్ట్ లోపల పెట్టుకుంది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఎవరు అడిగినా.. ఇది నా స్ట్రాటజీ అంటూ విరుద్ధంగా మాట్లాడింది. నవ్వు టీ షర్ట్ లోపల వేసుకుంటే వాటిని ఎలా తీయాలని రోహిత్ ప్రశ్నించగా.. కావాలంటే తీసుకో అని గీతూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడింది. నేను న్యాయంగా ఆడను, అన్యాయంగానే ఆడతా.. అది నా స్ట్రాటజీ పక్కవాళ్లు ఓడిపోవాలనేది నా వ్యూహం అంటూ రెచ్చిపోయింది.,ఈ టాస్క్‌ను గీతూ ముందుగా ఫినిష్ చేసినప్పటికీ.. పెట్టిన నెంబర్లు తప్పని తేలడంతో ఆమె తర్వాత పెట్టిన బాలాదిత్య కెప్టెన్ అయ్యాడు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య బాధ్యతలు తీసుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ ఈ వీక్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు ఏకాభిప్రాయంతో చెప్పాలని కంటెస్టెంట్లను ఆదేశిస్తారు. దీంతో అందరూ తమకు ఇష్టం లేని వ్యక్తిని వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంచుకున్నారు.,అయితే ఎక్కువ మంది మాత్రం గీతూనే నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌లోనూ గీతూ రచ్చ చేసింది. టీషర్ట్ లోపల చేయి పెట్టినా పట్టించుకోనని ఆమె చెప్పిన మాటలపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు కూడా తన వాదనే కరెక్ట్ అనేలా ప్రవర్తించింది. దీంతో ప్రేక్షకులు, నెటిజన్లు కూడా ఆమె తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.,