Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ బాలీవుడ్ ఫిల్మ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది-dulquer salmaan chup movie ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dulquer Salmaan Chup Movie Ott Release Date Locked

Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ బాలీవుడ్ ఫిల్మ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది

Nelki Naresh Kumar HT Telugu
Nov 19, 2022 03:12 PM IST

Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ సినిమా చుప్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

చుప్ మూవీ
చుప్ మూవీ

Chup OTT Release Date: దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ సినిమా చుప్ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను శ‌నివారం అనౌన్స్‌ చేశారు. విల‌క్ష‌ణ క‌థాంశాల‌తో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో హీరోగా చ‌క్క‌టి విజ‌యాల్ని అందుకుంటున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. అత‌డు హీరోగా న‌టించిన హిందీ సినిమా చుప్ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌తో డైరెక్ట‌ర్ ఆర్ బాల్కి చుప్‌ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా రివ్యూవ‌ర్స్‌ను మాత్ర‌మే చంపే ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను అర‌వింద్ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడు. ఈ హ‌త్య‌ల‌తో డానీ, నీల‌మీన‌న్ అనే జంట‌తో ఉన్న సంబంధం ఏమిట‌నే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

జ‌ర్న‌లిస్ట్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. పోలీస్ ఆఫీస‌ర్‌గా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. సెప్టెంబ‌ర్ నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ నెల 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను దాదాపు ఇర‌వై కోట్ల‌కు జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. చుప్ సినిమాలో శ్రేయ‌స్ ధ‌న్వంత‌రి హీరోయిన్‌గా న‌టించింది. క‌ర్వాన్‌, జోయా ఫాక్ట‌ర్ త‌ర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన బాలీవుడ్ సినిమా ఇది. ఇటీవ‌లే సీతారామం సినిమాతో తెలుగులో భారీ హిట్ అందుకున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌.

IPL_Entry_Point