Bimbisara Success Party: బింబిసార టీమ్‌కు సక్సెస్ పార్టీ ఇచ్చిన దిల్ రాజు-dil raju host a success party for bimbisara team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dil Raju Host A Success Party For Bimbisara Team

Bimbisara Success Party: బింబిసార టీమ్‌కు సక్సెస్ పార్టీ ఇచ్చిన దిల్ రాజు

HT Telugu Desk HT Telugu
Aug 08, 2022 07:35 AM IST

బింబిసార (Bimbisara) స‌క్సెస్‌ను పుర‌స్క‌రించుకొని సినిమా టీమ్‌కు నిర్మాత‌, నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ దిల్‌రాజు (Dil raju) స‌క్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

దిల్ రాజు, కీరవాణి, కళ్యాణ్ రామ్, వశిష్ట్
దిల్ రాజు, కీరవాణి, కళ్యాణ్ రామ్, వశిష్ట్ (twitter)

Bimbisara Success Party: టాలీవుడ్ వ‌రుస ప‌రాజ‌యాల‌కు బింబిసార‌, సీతారామం సినిమాల‌తో బ్రేక్‌ప‌డింది. కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ సినిమాలు అద్బుత‌మైన వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. చాలా రోజుల త‌ర్వాత హిట్ అనే మాట విన‌డంతో టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. చిరంజీవి, నాగార్జున‌, అల్లు అర్జున్‌తో పాటు ప‌లువురు అగ్ర‌హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సీతారామం, బింబిసార టీమ్‌ల‌ను అభినందిస్తున్నారు.

క‌ళ్యాణ్‌రామ్(Kalyan ram) హీరోగా న‌టించిన బింబిసార చిత్రం రెండు రోజుల్లోనే దాదాపు ప‌ది కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఆదివారం నాటితో ఈసినిమా బ్రేక్ ఈవెక్ కావ‌డమే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ స‌క్సెస్‌ను పుర‌స్క‌రించుకొని బింబిసార టీమ్‌కు నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ , నిర్మాత దిల్‌రాజు ఆదివారం స‌క్సెస్ పార్టీని ఇచ్చారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇందులో దిల్‌రాజుతో పాటు క‌ళ్యాణ్‌రామ్‌, ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌నిపిస్తున్నారు. నిజ‌మైన స‌క్సెస్ పార్టీ ఇదంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోల‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత స‌క్సెస్ పార్టీని చూస్తున్నామంటూ చెబుతున్నారు. నైజాంలో ఈ సినిమా ఐదు కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకున్న‌ది.

కాగా రెండు రోజుల్లోనే దాదాపు నాలుగు కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఆదివారం నాటితో నైజాం వ‌సూళ్లు ఐదు కోట్ల‌ను దాటిన‌ట్లు స‌మాచారం. నైజాంలో ఈ సినిమా లాభాల బాట ప‌ట్ట‌డంతోనే టీమ్‌కు దిల్‌రాజు పార్టీ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపించారు. బింబిసారుడిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో అత‌డి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఈ సినిమాకు వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

IPL_Entry_Point

టాపిక్