Choreographer Chaitanya: కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య సూసైడ్‌ - సెల్ఫీ వీడియోలో ఢీ, జ‌బ‌ర్ద‌స్త్ షోల‌పై షాకింగ్ కామెంట్స్-dhee choreographer chaitanya commits suicide selfie video viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dhee Choreographer Chaitanya Commits Suicide Selfie Video Viral

Choreographer Chaitanya: కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య సూసైడ్‌ - సెల్ఫీ వీడియోలో ఢీ, జ‌బ‌ర్ద‌స్త్ షోల‌పై షాకింగ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Apr 30, 2023 08:39 PM IST

Dhee Choreographer Chaitanya Suicide: ఢీ షో కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అప్పుల బాధ‌తోనే అత‌డు సూసైడ్ చేసుకున్న‌ట్లుగా స‌మాచారం.

చైత‌న్య
చైత‌న్య

Dhee Choreographer Chaitanya Suicide: ఢీ షో కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అప్పుల బాధ‌తోనే తాను చ‌నిపోతున్న‌ట్లుగా సూసైడ్‌కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో చైత‌న్య పేర్కొన్నాడు. అప్పులుతీర్చ‌డానికి చాలా ట్రై చేశాన‌ని, త‌న వ‌ల్ల కాలేద‌ని ఈ వీడియోలో అత‌డు పేర్కొన్నాడు.

ఢీ షో పేరు ఇస్తుంది కానీ సంపాద‌న త‌క్కువ‌గానే ఉంటుంద‌ని, జ‌బ‌ర్ధ‌స్త్ షో అయితే ఎక్కువ‌గా సంపాదించుకోవ‌చ్చున‌ని చైత‌న్య పేర్కొన్నాడు. అయినా ఢీ షో ద్వారా తాను పేరు తెచ్చుకోగలిగానని, కానీ ఈ షో వ‌ల్ల తాను ఇల్లు, టీవీ ఏమీ కొనుక్కోలేక‌పోయాన‌ని అన్నాడు. ఒక త‌ప్పుతో మ‌రో త‌ప్పు ఇలా చేస్తూనే పోయాన‌ని, చాలా ట్రై చేశాన‌ని, కానీ త‌న వ‌ల్ల కాక‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సివ‌చ్చింద‌ని చైత‌న్య పేర్కొన్నాడు.

అత‌డి సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెల్లూరులోని నైట్‌క్ల‌బ్ హోట‌ల్‌లో అత‌డి డెడ్‌బాడీని పోలీసులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతోన్న‌ట్లు తెలిసింది. ఢీ సీజ‌న్ ప‌ద‌మూడు, ప‌ధ్నాలుగుతో పాటు ప‌దిహేనుల‌లో చైత‌న్య కొరియోగ్రాఫర్ గా కనిపించాడు.

IPL_Entry_Point

టాపిక్