bigg boss 6 telugu: బిగ్‌బాస్ బూతులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది -సీపీఐ నారాయణ కామెంట్స్ వైరల్-cpi narayana sensational comments on bigg boss telugu show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Cpi Narayana Sensational Comments On Bigg Boss Telugu Show

bigg boss 6 telugu: బిగ్‌బాస్ బూతులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది -సీపీఐ నారాయణ కామెంట్స్ వైరల్

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 02:32 PM IST

bigg boss 6 telugu: ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బూతులకు కేరాఫ్ అడ్రస్ గా ఈ షో నిలుస్తుందంటూ ఆయన పేర్కొన్నడం హాట్ టాపిక్ గా మారింది.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6
బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 (Twitter)

bigg boss 6 telugu: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 ఆదివారం మొద‌లైంది. ఓ కపుల్ తో సహా మొత్తం ఇర‌వై ఒక్క మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున వారిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కీర్తిభ‌ట్, సుదీప‌, శ్రీహాన్, చలాకీ చంటి, శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, రోహిత్‌- మరీనా, బాలాదిత్య, వాసంతి, షానీ సల్మాన్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి, రేవంత్ కంటెస్టెంట్‌గా ఈ సారి ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతున్నారు.

కాగా బిగ్‌బాస్ షోపై సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ బూతులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని అన్నాడు. ఈ షో పూర్తిగా అనైతికమని పేర్కొన్నాడు. కాసులకు కక్కుర్తి పడే వాళ్లు ఉన్నంత కాలం ఇలాంటి రియాలిటీ షోలు వస్తునే ఉంటాయని నారాయణ అన్నాడు. బిగ్ బాస్ షోతో ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నాడు.

బిగ్ బాస్ షోపై నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిగ్ బాస్ పై నారాయణ ఘాటుగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ షోపై ఆయన విమర్శలు గుప్పించారు.

IPL_Entry_Point