Ajay Kathrvar First look: బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజయ్ హీరోగా సినిమా.. ఫస్ట్ లుక్ వచ్చేసింది
Ajay Gadu Movie firts Look: బిగ్‌బాస్‌తో పాపులారిటీ సంపాదించిన అజయ్ కతుర్వార్.. హీరోగా ముందుకు రాబోతున్నాడు. అతడు నటించిన తాజా చిత్రం అజయ్ గాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు సత్యదేవ్ ఆవిష్కరించారు.
Ajay Gadu Movie firts Look unvieled: బిగ్‌బాస్ షో ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ ఓటీటీ షో నాన్‌స్టాప్‌లో కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ కతుర్వార్ హీరోగా మరాడు. ఇటీవలే విశ్వక్ సినిమాలో కనిపించిన అజయ్.. ప్రస్తుతం హీరోగా ఓ సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమా పేరు అజయ్ గాడు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అందర్నీ ఆకర్షించింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ పోస్టర్‌ను ప్రముఖ టాలీవుడ్ హీరో సత్యదేవ్ ఆవిష్కరించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. భానుశ్రీ, శ్వేతామెహతా ఇందులో కథనాయికలుగా నటిస్తున్నారు. చొక్కా లేకుండా కాలిపోతున్న పేపర్ చదువుతూ.. సీరియస్ లుక్‌లో ఉన్న అజయ్ ఆకర్షణీయంగా కనిపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అజయ్ గాడు అనే టైటిల్‌తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ ప్రాజెక్టుకు అజయ్‌నే దర్శకత్వం వహించడం గమనార్హం. చందనా కొప్పిసెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై అతడే నిర్మాతగా వ్యవహరించారు. భానుశ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతాన్ని అందిస్తుండగా.. సిద్ధార్థ్ శివుని సంగీతాన్ని సమకూర్చారు.
సంబంధిత కథనం