Geetu Cries after watching Family episode: బిగ్‌బాస్ చూస్తూ ఏడ్చేసిన గీతూ.. ఫ్యామిలీ ఎపిసోడ్‌పై భావోద్వేగం
Geetu Cries after watching Family episode: ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 6 షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులను చూసిన ఆనందంలో కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ చూసిన గీతూ కూడా ఏడుస్తోంది. తన తల్లిని ఈ షోలోకి తీసుకురావాలని కోరుకున్న ఆమెకు ఇది చేదుగా అనిపిస్తోంది.
Geetu Cries after watching Family episode: బిగ్‌బాస్ దేశవ్యాప్తంగా ఎంతో పాపులరైన టీవీ షో. దేశంలో పలు భాషల్లో విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ షో తెలుగులోనూ అంతే రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం సీజన్ 6 నడుస్తోంది. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈ సారి పెద్దగా రసవత్తరంగా లేదని టాక్ వినిపిస్తోంది. అందులోనూ నిజం లేకపోలేదు. ఇందుకు కంటెస్టెంట్ల ఎంపిక కారణం. గేమ్ గురించి కనీస అవగాహన లేనివాళ్లు చాలా మందే ఉన్నారు. ఇదే సమయంలో బిగ్‌బాస్ గేమ్ గురించి అతిగా ఆలోచించే గీతూ రాయల్ లాంటి వారి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా 9 వారాలే ఇంట్లో ఉండి హౌస్ నుంచి ఎలిమినేటైంది. ఇందుకు ఆమె చాలా బాగా హర్ట్ అయిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ స్టేజ్‌పైనే ఏడుస్తూ కూర్చుంది.
ట్రెండింగ్ వార్తలు
తన ఓవర్ కాన్ఫిడెంట్‌తో గేమ్‌లో లూప్స్ వెతకడం, స్ట్రాటజీలు వేయడం లాంటి కారణాలతో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన గీతూ రాయల్‌కు బయట ఫుల్ నెగిటివిటీ వచ్చింది. విన్నర్ అయిపోతానని తనకు తానే ఫిక్స్ అయిపోయిన గీతూకు.. ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఊరికే ఉండక తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆడియెన్స్‌కు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా.. తరచూ ఏడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఏడ్చింది గీతూ. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోన్న వేళ.. హౌస్ మేట్స్ అంతా తమ కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన గీతూ.. కన్నీరుమున్నీరైంది.
ఈ వీడియోను గీతూ భర్త వికాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. "గీతూ ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కంది. షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొన్నిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడెన్ ఎలిమినేషన్‌కు మేమంతా కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాం. ఫ్యామిలీ థీమ్‌లో వాళ్ల అమ్మను బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలనుకుంది. ఇప్పుడిలా ఎపిసోడ్ చూసేటప్పుడు అమ్మను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తోంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉంటారనుకుంటున్నాం" అని గీతూ భర్త వికాస్ రాసుకొచ్చాడు.
సంబంధిత కథనం