Bigg Boss 6 Telugu Episode 28: సీజన్ మొత్తం కెప్టెన్సీకి చంటి దూరం - సూర్యతో రిలేషన్‌షిప్‌పై ఆరోహి క్లారిటీ
Bigg Boss 6 Telugu Episode 28: సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హతను చంటి కోల్పోయాడు. సూర్యతో తనకున్న రిలేషన్‌షిప్ గురించి ఆరోహి క్లారిటీ ఇచ్చింది. రేవంత్‌కు సీమంతం జరిపే ఏర్పాట్లు చేస్తానని నాగార్జున ప్రామిస్ చేశాడు. వీటితో పాటు ఎపిసోడ్ 28 లోని హైలైట్స్ ఏవంటే.
Bigg Boss 6 Telugu Episode 28: బిగ్‌బాస్ మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లో నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌజ్‌లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయని ఆడియోన్స్‌తో నాగార్జున చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. గీతూ మొదటిసారి ఏడ్వడం, బాలాదిత్యకు కోపం రావడం అద్భుతమే అంటూ నాగార్జున ఫన్నీగా కామెంట్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ఆర్జే సూర్య ఫుడ్ వేస్ట్ చేసిన వీడియోను చూపించారు. అతడికి కెప్టెన్ ఆదిరెడ్డి పనిష్‌మెంట్ ఇవ్వకపోవడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. ఆరోహి మీద కోపంతోనే తాను ఫుడ్ పడేశానని సూర్య చెప్పిన రీజన్‌తో నాగ్ కన్వీన్స్ కాలేదు. ఆరోహితో ఒక రోజు మొత్తం మాట్లాడవద్దని సూర్యకు కొత్త కెప్టెన్ కీర్తి పనిష్‌మెంట్ ఇచ్చింది. ఆ పనిష్‌మెంట్‌ను అమలు చేసే బాధ్యతను ఆదిరెడ్డికి అప్పగించాడు నాగార్జున
గిఫ్ట్స్ కట్...
ఇనాయా ఏజ్ విషయంలో శ్రీహాన్ చేసిన కామెంట్‌పై నాగ్ సీరియస్ అయ్యాడు. మరోసారి అలాంటి కామెంట్స్ చేయవద్దని అతడికి వార్నింగ్ ఇచ్చాడు. బాలాదిత్యకు కోపం రావడం అద్భుతంగా అనిపించిందని నాగార్జున అన్నాడు. బాలాదిత్యను ఫ్యామిలీ మెంబర్‌గా గీతూ నమ్మితే అతడి వల్లే ఆమె ఈ వారం హర్ట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నది. అందుకు గల కారణాల్ని నాగార్జున అడిగారు.
అవసరం వచ్చినప్పుడు నేను ఉన్నాను అందరు చెప్పడం కంటే ఎవరున్నారన్నది ముఖ్యమని గీతూ చెప్పింది. ఆ ఇంటెన్షన్ బాలాదిత్యలో కనిపించలేదని గీతూ పేర్కొన్నది. బాలాదిత్యకు క్షమించేది లేదంటూ చెప్పింది. బిగ్‌బాస్ ఇచ్చిన గిఫ్ట్‌ను సరిగా దాచిపెట్టలేనందుకు భవిష్యత్తులో బాలాదిత్య బహుమతులు తీసుకోవడానికి అనర్హుడంటూ నాగార్జున ప్రకటించాడు.
రూల్స్‌కు విరుద్ధంగా ఆడిన రాజ్
హోటల్ వర్సెస్ హోటల్‌లో గేమ్‌లో డబ్బులు ఖర్చు పెట్టకుండా రూల్స్‌కు విరుద్ధంగా ఆడిన రాజ్‌కు నాగార్జున క్లాస్ ఇచ్చాడు. హోటల్ టాస్క్‌లో బాగా ఆడిన గీతూకు గిఫ్ట్ ఇచ్చాడు. రెస్పెక్ట్ ఇవ్వడానికి గీతూ డబ్బులు అడగడం బాగాలేదని నాగార్జున అన్నాడు. రేవంత్‌కు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. రేవంత్‌కు సీమంతం జరపాలని గీతూ పట్టుపట్టింది. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఒప్పుకుంటే తప్పకుండా ఏర్పాట్లు చేస్తానని నాగార్జున మాట ఇచ్చాడు. ఫైమా, సుదీప ఇద్దరు గేమ్ ఆడిన తీరు బాగుందని నాగార్జున అన్నాడు.
BB 6 Episode 28:బుజ్జమ్మ ఎవరు...
సూర్యకు, తనకు మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఆరోహి క్లారిటీ ఇచ్చేసింది. సూర్యకు బుజ్జమ్మ అనే అమ్మాయితో రిలేషన్‌షిప్ ఉందని చెప్పింది. కెప్టెన్ అయినందుకు కీర్తికి ఐదు వందలు గిఫ్ట్‌గా ఇచ్చాడు నాగార్జున. కానీ గేమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయినందుకు అందులో నుంచి డబ్బులు కట్ చేశాడు. శ్రీసత్య గేమ్‌లో ఎలాంటి మైనస్‌లు లేవని నాగార్జున మెచ్చుకున్నాడు.
BB 6 Episode 28: ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయిన చంటి...
ఆట ఇరగదీస్తానని ప్రామిస్ చేసిన చంటి ఆ మాటను నిలబెట్టుకోలేదని ఇకపై బాగా ఆడాలని నాగార్జున అతడిపై సీరియస్ అయ్యాడు. వాసంతి, రోహిత్- మరీనా గేమ్ ఇంప్రూవ్ కావాలని అన్నాడు. కెప్టెన్‌గా ఆదిరెడ్డి ఫెయిలయ్యాడని నాగార్జున అన్నాడు. కంటెస్టెంట్స్ చాలా మంది నిద్రపోయినా అతడు కనిపెట్టలేకపోయాడని నాగార్జున చెప్పాడు. తనకు ఇచ్చిన డబ్బులను కాపాడుకోలేకపోయినందుకు ఇనాయాకు జీరో మార్కులు ఇచ్చాడు.
చంటి కెప్టెన్సీకి దూరం...
ఆదిరెడ్డి, చంటి, ఇనాయా, బాలాదిత్య డబ్బులు సేవ్ చేసుకోలేకపోయారని, ఆ నలుగురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరికి సీజన్ మొత్తం కెప్టెన్‌గా కొనసాగే అర్హత లేదంటూ పేర్కొన్నాడు. అందులో ఇనాయాకు మూడు ఓట్లు, చంటి మూడు ఓట్లు, ఆదిరెడ్డికి ఒక ఓటు వచ్చింది. బాలాదిత్యకు ఎవరు ఓటు వేయలేదు. అందులో ఎవరిని సెలెక్ట్ చేయాలో చెప్పాలంటూ కెప్టెన్ కీర్తిని అడగ్గా ఆమె చంటి పేరు చెప్పింది. సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హతను చంటి కోల్పోయాడు.