Prabhas Reacts on Dating Rumours: మేడమ్ ఆల్రెడీ చెప్పేసింది - డేటింగ్ రూమర్స్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే
Unstoppable Prabhas: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో కృతిసనన్‌తో డేటింగ్ రూమర్స్‌పై ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు. అతడు ఏమన్నాడంటే...
Unstoppable Prabhas: ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు ప్రభాస్. కృతిసనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల గురించి అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ చెప్పిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు
నువ్వు ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నావు. కానీ రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు అని ప్రభాస్‌ను అడిగాడు బాలకృష్ణ. ఈ ప్రశ్నకు అదేదో పాత న్యూస్...ఏం లేదని మేడమ్ ఆల్రెడీ చెప్పేసింది అని ప్రభాస్ చెప్పడం ఆసక్తిని పంచుతోంది.
నువ్వు నవ్వుతూ నో అంటున్నావు, ఆ అమ్మాయి మాత్రం సీరియస్‌గా నో అని చెబుతోంది. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం అంటూ బాలకృష్ణ సరదాగా ప్రభాస్‌ను ఆటపట్టించగా...ఏమీ లేకపోయినా గోల చేస్తున్నారు అని ప్రభాస్ చెప్పడం నవ్వులను పంచుతోంది.
మేడమ్ పేరు చెప్పాల్సిందే అని బాలకృష్ణ పట్టుపట్టగా కృతిసనన్ అంటూ ప్రభాస్ పేర్కొనడం షోకు హైలైట్‌గా నిలిస్తోంది. ఆ తర్వాత నీ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏది అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ఇందక మీ షో వాళ్లు ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారు. మర్చిపోయా. నెక్స్ట్ షోలో గ్యారంటీగా చెబుతా అని ప్రభాస్ పేర్కొన్నాడు. నిజంగా రొమాంటిక్ సీన్స్ అయితే పెళ్లి జరిగేది అంటూ సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం కృతిసనన్ తో కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా... జానకి పాత్రను కృతిసనన్ పోషిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.