NBK107 : భయం నా బయోడేటాలోనే లేదంటున్న బాలయ్య.. తొలి వేట మొదలైంది.. టీజర్ రిలీజ్-balakrishna nbk107 first teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nbk107 : భయం నా బయోడేటాలోనే లేదంటున్న బాలయ్య.. తొలి వేట మొదలైంది.. టీజర్ రిలీజ్

NBK107 : భయం నా బయోడేటాలోనే లేదంటున్న బాలయ్య.. తొలి వేట మొదలైంది.. టీజర్ రిలీజ్

Maragani Govardhan HT Telugu
Jun 09, 2022 07:26 PM IST

బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాస్ యాక్షన్‌తో బాలయ్య అదరగొట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

<p>బాలకృష్ణ</p>
<p>బాలకృష్ణ</p> (Twitter)

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పేరు ఇంకా ఖరారు కానీ ఈ సినిమా NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైంది. ఈ సినిమా పేరును త్వరలో విడుదల చేయనున్నారు. శుక్రవారం(జూన్ 10) బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్‌ను ఇచ్చింది చిత్రబృందం. ఫస్ట్ హంట్ పేరుతో టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ తనదైన మాస్ శైలిలో రెచ్చిపోయారు.

టీజర్ ఆద్యంతం బాలయ్య అదరగొట్టారు. అదిరిపోయే డైలాగులు, మాస్ యాక్షన్‌తో అభిమానులను అలరించారు. ఇందులో బాలయ్య ఆహార్యం, ఆయన చెప్పిన డైలాగులు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. పులిచర్ల నేపథ్యంలో శక్తమంతమైన యాక్షన్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. భయం నా బయోడేటాలోనే లేదురా అని బాలకృష్ణ చెప్పే సంభాషణకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు.

పక్కా కమర్షియల్ హంగులతో రూపుదిద్దికుంటున్న ఈ చిత్ర టైటిల్, విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ తెలయజేయనున్నారు. క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమా కావడం, ఇటుపక్క అఖండ లాంటి భారీ విజయం తర్వాత బాలయ్య సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

సంబంధిత కథనం

టాపిక్