Ashu Reddy: అక్కడ పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న బిగ్‌బాస్ బ్యూటీ..!-ashu reddy gets pawan kalyan tattoo on her private parts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ashu Reddy: అక్కడ పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న బిగ్‌బాస్ బ్యూటీ..!

Ashu Reddy: అక్కడ పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న బిగ్‌బాస్ బ్యూటీ..!

Maragani Govardhan HT Telugu
Jul 05, 2022 09:46 AM IST

బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి.. పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. తన ప్రైవేటు భాగాలపై పవన్ పేరును టాటూగా వేయించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అషూ రెడ్డి
అషూ రెడ్డి (Instagram)

టాటూలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తనకు నచ్చిన, అభిమాన హీరోకు చెందిన పచ్చబొట్లు వేయించుకోవడం ఎక్కువైంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల టాటూలపై ఫ్యాన్స్ ప్రత్యేక దృష్టి పెడతారు. అందులోనూ హీరోయిన్ల విషయానికొస్తే ఈ ఫోకస్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి అదే ప్రయత్నం చేసింది. ఛాతీపై తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు వేయించుకుంది.

పవన్ కల్యాణ్ టాటూలను ఛాతీపై టాటూగా వేయించుకుని తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ అమ్మాయి తన ప్రైవేటు భాగాలపై పచ్చబొట్టు వేయించుకుని ఆ ఫొటోలను షేర్ చేయడం చాలా పెద్ద విషయం. కానీ అషూ రెడ్డి మాత్రం ధైర్యంగా తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం ఈ పొటోలు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె ధైర్యాన్ని తమ స్పందనల రూపంలో ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆమె చేసిన పనిని విమర్శిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇంకా వైవిధ్యంగా స్పందిస్తున్నారు. ఫేమ్ కోసం పవన్ కల్యాణ్ పచ్చబొట్టును ఛాతీపై వేయించుకుందని కామెంట్ చేస్తున్నారు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఆమె చూపించాలనకున్నప్పుడు ఈ పచ్చబొట్టును ఎవరికీ చూపించలేదని వ్యాఖ్యనించారు.

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో తొలిసారిగా హౌస్‌లోకి వెళ్లిన అషూ.. ఆ సీజన్‌లో నాలుగు వారాల పాటు ఉంది. అనంతరం ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లోనూ రెండోసారి హౌస్ లోకి అభిమానులను అలరించింది. ఈ సారి 8 వారాల పాటు హౌస్‌లో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్