OTT BIGG BOSS | హౌస్ మేట్స్ ను ఫూల్ చేసిన శివ‌, అఖిల్‌...బిగ్‌బాస్‌లో సంద‌డి చేసిన యాంక‌ర్ సుమ -anchor suma comes the bigg boss house as a special guest ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anchor Suma Comes The Bigg Boss House As A Special Guest

OTT BIGG BOSS | హౌస్ మేట్స్ ను ఫూల్ చేసిన శివ‌, అఖిల్‌...బిగ్‌బాస్‌లో సంద‌డి చేసిన యాంక‌ర్ సుమ

Nelki Naresh HT Telugu
Apr 02, 2022 10:48 PM IST

ఉగాది సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సుమ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. కంటెస్టెంట్స్ కు టాస్క్ లతో పాటు పనిష్ మెంట్స్ ఇవ్వడమే కాకుండా కామెడీ పంచ్ లతో నవ్వించింది.

సుమ క‌న‌కాల
సుమ క‌న‌కాల (twitter)

శనివారం ఉదయం గార్డెన్ ఏరియాలో బిగ్‌బాస్ సర్ ప్రైజ్ గిఫ్ట్ లు పెట్టాడంటూ అఖిల్‌,శివ అంద‌రిని న‌మ్మించారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వాళ్ల‌ను ఫూల్స్ చేశారు. వారి మాట‌లు న‌మ్మి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బిందు,మిత్రా శ‌ర్మ‌,హ‌మీదా,ముమైత్‌ఖాన్‌ల‌కు ఏప్రిల్ ఫూల్ అంటూ ఏడిపించారు.

ఉగాది సంద‌ర్భంగా శనివారం కంటెస్టెంట్స్ మొత్తం ట్రెడిష‌న‌ల్ డ్రెస్సుల‌లో క‌నిపించారు. ఈ సంద‌ర్భంగా కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా విడిపోయి ఉగాది ప‌చ్చ‌డి చేయ‌మ‌ని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అందులో ఏ టీమ్ ఉగాది పచ్చడి బాగుంటుందో వచ్చే గెస్ట్ చెబుతారని బిగ్ బాస్ అన్నాడు. ఉగాది పచ్చడి టాస్క్ కోసం అమ్మాయిలు ఓ టీమ్‌గా,అబ్బాయిలు మ‌రో టీమ్‌గా విడిపోయారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరు గెస్ట్ గా వ‌స్తార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.

సుమ క‌న‌కాల గెస్ట్‌గా వ‌చ్చి సంద‌డి చేసింది. ఈ టాస్క్ లో అబ్బాయిల టీమ్ విన్న‌ర్‌గా నిలిచిందని సుమ అనౌన్స్ చేసింది. కొంత‌మంది త‌మ ఇళ్ల‌లో కంటే బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉంటున్నార‌ని కంటెస్టెంట్స్ అంద‌రిపై పంచ్‌లు వేసి సుమ న‌వ్వించింది. హౌస్ మేట్స్ కోసం ఫుడ్ ఐట‌మ్స్ తీసుకొచ్చింది. పులిహోర ను అజ‌య్‌కి ఇచ్చింది. అత‌డికి పులిహోర అజ‌య్‌గా పేరుపెట్టింది. హ‌మీదాను ముద్ద‌ప‌ప్పుగా సుమ పేర్కొన‌డంతో హౌస్‌లో న‌వ్వులు వెల్లివిరిసాయి. హౌస్‌లో ఫైర్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అరియానా మారిపోయింద‌ని చెప్పింది.

నూతన సంవత్సరాది సందర్భంగా ఇతర కంటెస్టెంట్స్ లో రావాల్సిన మార్పులేమిటో ఒక్కొక్కరుగా చెప్పాలని సుమ టాస్క్ ఇచ్చింది. తెలుగులోనే మాట్లాడాలని చెప్పింది. ఇందులో మొదటగా శివ గురించి అఖిల్ చెప్పాల‌ని సుమ పేర్కొన్న‌ది. శివ ఆట‌ను క‌ఠినంగా ఆడుతున్నాడ‌ని,కొన్ని సార్లు అతడి మ‌న‌స్త‌త్వం వ‌ల్ల ఎదుటివారు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అఖిల్ చెప్ప‌బోతు మ‌ధ్య‌లో ఇంగ్లీష్ ప‌దం మాట్లాడి ప‌నిష్‌మెంట్ ఎదుర్కొన్నాడు. ఆ త‌ర్వాత న‌ట‌రాజ్ మాస్ట‌ర్ గురించి శివ చెప్పాలని సుమ పేర్కొన్నది. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కోపం త‌గ్గించుకుంటే బాగుంటుంద‌ని శివ చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది.

 

IPL_Entry_Point

టాపిక్