Adipurush First Song: ఆదిపురుష్ నుంచి తొలి పాట వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న జై శ్రీరామ్ సాంగ్-adipurush first song jai shre ram has a great response from the audience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Adipurush First Song Jai Shre Ram Has A Great Response From The Audience

Adipurush First Song: ఆదిపురుష్ నుంచి తొలి పాట వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న జై శ్రీరామ్ సాంగ్

Maragani Govardhan HT Telugu
Apr 06, 2023 01:56 PM IST

Adipurush First Song: ఆదిపురుష్ నుంచి మొదటి పాట వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా బిట్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. జై శ్రీరామ్ అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది.

ఆదిపురుష్ నుంచి తొలి పాట
ఆదిపురుష్ నుంచి తొలి పాట

Adipurush First Song: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఇటీవలే శ్రీ రామ నవమి కానుకగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. గురువారం నాడు హనుమాన్ జయంతి సందర్బంగా హనుమాన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చింది. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. ఆదిపురుష్ నుంచి సరికొత్త పాటను రిలీజ్ చేసింది. ఆదిపురుష్ నుంచి విడుదలైన తొలి పాట.

జై శ్రీ రామ్ అంటూ సాగే ఈ పాట శ్రీ రామచంద్రుని కీర్తిని దశదిశలా చాటేలా ఉంది. నిమిషం పాటు సాగే ఈ బిట్ సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిందీ, సంస్కృతం మిళితమై ఉన్న ఈ పాట వింటుంటే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఈ పాట ఇప్పటికే శ్రోతల దృష్టిని ఆకర్షించింది. స్పాటిఫై సహా ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో నిలిచింది. జై శ్రీరామ్ వైబ్‌ను అందరిలోనూ కలిగిస్తోంది.

ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్‌లో రాముడిగా ప్రభాస్ వేషధారణ దగ్గర నుంచి గ్రాఫిక్స్ వరకు పలు విమర్శలను ఎదుర్కొంటోంది చిత్రబృందం. ఇటీవల శ్రీ రామ నవమికి విడుదలై పోస్టర్‌పై కూడా విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా విడుదలైన జై శ్రీరామ్ పాటపై మాత్రం అందరిలోనూ సానుకూల భావాన్ని కలిగిస్తోంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point