iPhone 14 Pro special edition : ఈ ఐఫోన్ 14 ప్రో​ ఖరీదు- రూ. 1.1కోట్లు..!-this apple iphone 14 pro model costs over 1 crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  This Apple Iphone 14 Pro Model Costs Over 1 Crore

iPhone 14 Pro special edition : ఈ ఐఫోన్ 14 ప్రో​ ఖరీదు- రూ. 1.1కోట్లు..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 31, 2022 08:38 PM IST

iPhone 14 Pro special edition : ఈ ఐఫోన్​ 14 ప్రో ధర రూ. 1.1కోట్లు! ఇది ఇంత ఖరీదు ఎందుకు ఉందంటే..

ఈ ఐఫోన్​ ఖరీదు- రూ. 1.1కోట్లు.. ఎందుకంటే!
ఈ ఐఫోన్​ ఖరీదు- రూ. 1.1కోట్లు.. ఎందుకంటే! (Caviar)

iPhone 14 Pro special edition : రష్యన్​ లగ్జరీ బ్రాండ్​ కేవియర్​.. యాపిల్​ ఐఫోన్​ 14 ప్రో స్పెషల్​ ఎడిషన్​ను లాంచ్​ చేసింది. దీని విలువ 133,670డాలర్లు. అంటే.. భారత కరెన్సీలో రూ. 1.1కోట్లు! ఈ స్పెషల్​ ఎడిషన్​లో ఐఫోన్​ 14 ప్రో వెనుక భాగంలో రోలెక్స్​ వాచ్​ ఉంది.

రోలెక్స్​ కాస్మాగ్రాఫ్​ డేయ్​టోనాను గోల్డ్​, 8 డైమండ్లతో రూపొందించి.. యాపిల్​ ఐఫోన్​ 14 ప్రో వెనుక జత చేశారు. మాల్కమ్​ క్యాంప్​బెల్​ బ్లూ బర్డ్​ సుపర్​కార్​ స్ఫూర్తితో ఈ ఐఫోన్​ 14 ప్రో స్పెషల్​ ఎడిషన్​ను డిజైన్​ చేశారు. మొదటి రోలెక్స్​ డేయ్​టోనా వాచ్​ను రూపొందించిన వ్యక్తి పేరు మాల్కమ్​ క్యాంప్​బెల్​. ఈ వాచ్​కు మూడు ఎడిషన్లు మాత్రమే ఉన్నాయి.

iPhone 14 Pro Rolex watch : ఇక కేవియర్​ వెబ్​సైట్​లో ఈ ఐఫోన్​ 14 ప్రో స్పెషల్​ ఎడిషన్​ లిస్ట్​ అయ్యి ఉంది. 1930 నాటి రేసింగ్​ కార్​ స్టైల్​లో ఈ ఐఫోన్​ బాడీని తయారు చేశారు. ఇది తమ బ్రాండ్​కు చెందిన అత్యంత లెంజడరీ కలెక్షన్లలో ఒకటిగా నిలిచిపోతుందని కంపెనీ పేర్కొంది. రేసింగ్​కు ఈ స్పెషల్​ ఎడిషన్​ను డెడికేట్​ చేస్తున్నట్టు ప్రకటించింది.

"గోల్డెన్​ రోలెక్స్​ డేయ్​టోనా ఎంతో విలువైన ఆర్ట్​. ఇప్పుడు దీనికి యాపిల్​ స్మార్ట్​ఫోన్​ తోడైంది. మానవజాతిలో ఎంతో అద్భుతమైనది యాపిల్​ స్మార్ట్​ఫోన్​. ఈ రెండు కలవడం ఎంతో సంతోషంగా ఉంది," అని కేవియర్​ పేర్కొంది.

ఈ లిమిటెండ్​ ఎడిషన్​ ఐఫోన్​ 14 ప్రో మోడల్​కు డెకొరేటివ్​ డయల్స్​ కూడా ఉన్నాయి. స్పీడోమీటర్​, ఆయిల్​-ఫ్యూయెల్​ ఇండికేటర్లను 18క్యారట్ల గోల్డ్​తో రూపొందించారు. జ్యువెల్రీ ఎనామెల్​తో పెయింట్​ చేశారు. డాష్​బోర్డ్​ మీద స్విఛ్​లను కూడా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. కేస్​పైన ఉన్న మల్టీ లెవల్​ బాడీని బ్లాక్​ పీవీడి కోటింగ్​తో ఉన్న టిటానియంతో రూపొందించారు.

కేవియర్​ ప్రాడక్టులకు సహజంగా ఐదంచెల రక్షణతో ఇంటర్నేషనల్​ సర్టిఫికేట్​ ఉంటుంది. వీటికి డిమాండ్​ కూడా విపరీతంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్పెషల్​ ఎడిషన్​ ఐఫోన్​ 14 ప్రోని ఎవరు దక్కించుకుంటారో చూడాలి!

ఐఫోన్​ 14 ప్రో..

iPhone 14 pro : ఐఫోన్ 14 సిరీస్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో బెస్ట్ సెల్లర్‌గా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. భారతదేశంలో Apple iPhone 14 Pro ధర 1,29,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్​ 14 ప్రో, ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​.. దాదాపుగా ఒకే ఫీచర్స్​ కలిగి ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం