Tata Technologies IPO: టాటా గ్రూప్ లోని కీలక సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ (Tata Motors) అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్. ఈ టాటా టెక్నాలజీస్ (Tata Technologies) ఐపీఓ (IPO) త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆఫర్ ఫర్ సేల్ (offer for sale OFS) ద్వారా ఈ సంస్థ పెట్టుబడులను సమీకరించాలనుకుంటోంది. ఐపీఓ (IPO) కు వెళ్లడానికి అవసరమైన డాక్యుమెంట్లను ఇటీవల టాటా టెక్నాలజీస్ సెబీ (SEBI) కి అందజేసింది. చివరగా ఐపీఓకు వచ్చిన టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services TCS). ఈ సంస్థ ఐపీఓ (IPO) 2004లో వచ్చింది.
ఈ ఐపీఓ (IPO) ద్వారా టాటా టెక్నాలజీస్ (Tata Technologies) మొత్తం 95,708,984 ఈక్విటీ షేర్లను మార్కెట్లో పెడుతోంది. వీటిలో 81,133,706 ఈక్విటీ షేర్లు టాటా టెక్నాలజీస్ లోని ప్రధాన వాటాదారు అయిన టాటా మోటార్స్ (Tata Motors) వి. 9,716,853 ఈక్విటీ షేర్లు ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ (Alpha TC Holdings)వి, 4,858,425 ఈక్విటీ షేర్లు టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్(Tata Capital Growth Fund) వి. మొత్తంగా 23.6% వాటాను వీరు అమ్మేయనున్నారు. వీటిలో 50% క్యూఐఐ (qualified institutional ) లకు, 25% రిటైల్ ఇన్వెస్టర్లకు (retail ) రిజర్వ్ చేశారు.
Tata Technologies ఐపీఓ (IPO) పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఐపీఓ (IPO) ప్రకటన, లాట్ సైజ్, ఆఫర్ ప్రైస్, ఎలాట్మెంట్ డేట్స్ .. మొదలైన వివరాలను త్వరలో వెల్లడిస్తారు. ఈ ఐపీఓ (IPO) కు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
టాటా టెక్నాలజీస్ (Tata Technologies) టాటా మోటార్స్ (Tata Motors) అనుబంధ సంస్థ. ఇది ఆటోమోటివ్, ఏరో స్పేస్ ఇండస్ట్రీస్ కు ఇంజినీరింగ్ అండ్ డిజైన్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్ మెంట్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ఐటీ సర్వీస్ మేనేజ్ మెంట్ రంగాల్లో సేవలను అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ టాటా టెక్నాలజీస్ (Tata Technologies) కు అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో క్లయింట్స్ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022- 23) డిసెంబర్ తో ముగిసే మూడు త్రైమాసికాలకు (2022 మార్చి నుంచి 2022 డిసెంబర్ వరకు) టాటా టెక్నాలజీస్ రూ. 3,011 కోట్ల ఆదాయం ఆర్జించింది.