Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 150 స్టాక్​తో భారీ లాభాలు పక్కా!-stocks to buy today 26th april 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 150 స్టాక్​తో భారీ లాభాలు పక్కా!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 150 స్టాక్​తో భారీ లాభాలు పక్కా!

Sharath Chitturi HT Telugu
Apr 26, 2024 08:22 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 486 పాయింట్లు పెరిగి 74,339 వద్ద స్థిరపడింది. 168 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 22,570 వద్ద ముగిసింది. ఇక 306 పాయింట్ల లాభంతో 48,495 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో పాజిటివ్​ ట్రెండ్​ కనిపిస్తోంది. రానున్న రోజుల్లో నిఫ్టీ మరింత పెరగొచ్చు. ఆల్​ టైమ్​ హై 22,776 బ్రేక్​ చేయోచ్చు. 22,500- 22,300 లెవల్స్​ దగ్గర సపోర్ట్​ ఉంది. 22,780- 23,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. కానీ శుక్రవారం సాయంత్రం వెలువడే అమెరికా పీసీఈ డేటా చాలా కీలకంగా మారనుంది. మదుపర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news today : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2823.33 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6167.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Zerodha CEO : 'ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే..' జెరోధా నితిన్​ కామత్​ టిప్స్​..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.98శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.46శాతం మేర నష్టపోయాయి. నాస్​డాక్​ 0.64శాతం డౌన్​ అయ్యింది.

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy : ఐసీఐసీఐ బ్యాంక్​:- బై రూ. 1113.75, స్టాప్​ లాస్​ రూ. 1160, టార్గెట్​ రూ. 1087

కార్బొరండమ్​ యూనివర్స్​:- బై రూ. 1415, స్టాప్​ లాస్​ రూ. 1366, టార్గెట్​ రూ. 1499

ఆర్​ఈసీ:- బై రూ. 451, స్టాప్​ లాస్​ రూ. 440, టార్గెట్​ రూ. 475

జీఎంఆర్​ ఇన్​ఫ్రా:- బై రూ. 85, స్టాప్​ లాస్​ రూ. 83, టార్గెట్​ రూ. 90

ఐఆర్​ఎఫ్​సీ:- బై రూ. 150, స్టాప్​ లాస్​ రూ. 146, టార్గెట్​ రూ. 162

కాన్​కర్​:- బై రూ. 1010- రూ. 1012, స్టాప్​ లాస్​ రూ. 973, టార్గెట్​ రూ. 1087

యూపీఎల్​:- బై రూ. 505.5 స్టాప్​ లాస్​ రూ. 490, టార్గెట్​ రూ. 535

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం