Stock Market News: నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు షురూ-stock markets session starts losses today nifty sensex down after us fed interest rate hike ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Markets Session Starts Losses Today Nifty Sensex Down After Us Fed Interest Rate Hike

Stock Market News: నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు షురూ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 23, 2023 09:19 AM IST

Stock Market News: భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market News: నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు షురూ
Stock Market News: నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు షురూ (MINT_PRINT)

Stock Market News: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మార్చి 23, గురువారం) నష్టాలతో ప్రారంభం అయ్యాయి. గత రెండు సెషన్లలో లాభాలను చూసిన భారత మార్కెట్లు.. నేడు ఓపెనింగ్‍లో ప్రతికూలంగా షురూ అయ్యాయి. సెషన్ ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 298.77 పాయింట్లు పడిపోయి 57,915 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 86.70 పాయింట్లు తగ్గి 17,065.20 వద్ద కొనసాగుతోంది. వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు యూఎస్ ఫెడ్ ప్రకటన తర్వాత అమెరికా మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

సెషన్ ఆరంభంలో కోరమాండల్ ఇంటర్నేషనల్, హీరో మోటోకార్ప్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్, గుజరాత్ గ్యాస్, హింద్ కాపర్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్, గెయిల్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, ఆల్కెమ్ ల్యాబ్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ నష్టాలతో టాప్ లూజర్లుగా ఓపెన్ అయ్యాయి.

అమెరికా మార్కెట్లు ఢమాల్

US Markets: వడ్డీ రేటును పావు శాతం పెంచడం సహా భవిష్యత్తులోనూ పెంపు ఉంటుందని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వటంతో బుధవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 530.49 పాయింట్లు నష్టపోయి 32,030.11 వద్దకు పడిపోయింది. ఎస్&పీ 500 సూచీ 65.9 పాయింట్లు నష్టపోయి 3,936.97 పాయింట్లకు పాయింట్లకు చేరగా.. 190.15 పాయింట్లు క్షీణించిన నాస్‍డాక్ కంపోజైట్ సూచీ 11,669.96 వద్ద స్థిరపడింది.

ఇక నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ఉండగా.. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. హాంగ్‍సెంగ్ సూచీ లాభాల్లో ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచింది. దీంతో వడ్డీ రేటు 4.75 శాతం నుంచి 5 శాతం రేంజ్‍లో ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని కిందికి తీసుకురావడమే లక్ష్యంగా భవిష్యత్తులోనూ వడ్డీ రేట్ల పెంపును పరిగణిస్తామని ఫెడ్ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభం నేపథ్యంలోనూ వడ్డీ రేట్లపై ఉదాసీనత చూపలేదు ఫెడ్.

డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.82.37 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

WhatsApp channel