Stock market news today : నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- నిఫ్టీ 70 పాయింట్లు డౌన్-stock market news today 6 december 2022 sensex and nifty opens on a negative note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 6 December 2022 Sensex And Nifty Opens On A Negative Note

Stock market news today : నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- నిఫ్టీ 70 పాయింట్లు డౌన్

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 06, 2022 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టపోయాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 277 పాయింట్లు కోల్పోయి 62,558వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 77 పాయింట్ల నష్టంతో 18,625 వద్ద ట్రేడ్​ అవుతోంది.

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో తీవ్ర ఒడుదొడుకులకు లోనై.. చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 34 పాయింట్ల నష్టంతో 62,835 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద ముగిసింది. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62396- 18601 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్స్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,621- 18,589 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,726- 18,758 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 112, టార్గెట్​ రూ. 122
  • డీఎల్​ఎఫ్​:- బై రూ. 418, స్టాప్​ లాస్​ రూ. 415, టార్గెట్​ రూ. 430
  • రిలయన్స్​ ఇండస్ట్రీస్​:- సెల్​ కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2677, టార్గెట్​ రూ. 2,652
  • అదానీ ఎంటర్​ప్రైజెస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ 3936, టార్గెట్​ రూ. 4,049

లాభాలు.. నష్టాలు..

ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ఎం, ఇన్ఫీ, ఏషియన్​ పెయింట్స్​, కొటాక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US Stock markets : అమెరికా స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్​ 1.4శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500 1.79శాతం, నాస్​డాక్​ 1.93శాతం మేర నష్టాలు చూశాయి. ఆర్థిక వ్యవస్థ డేటా సానుకూలంగా వస్తుండటంతో.. వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను ఫెడ్​ తగ్గించకపోవచ్చన్న భయం మదుపర్లలో నెలకొంది.

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. జపాన్​ నిక్కీ 0.23శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.28శాతం పతనమయ్యాయి. సౌత్​ కొరియా కాస్పి 1శాతం మేర నష్టాల్లో ఉంది.

చమురు ధరలు..

చమురు ధరలు 3శాతం పడిపోయాయి. బ్రెంట్​ క్రూడ్​ 2.89డాలర్ల పతనమై.. 82.68డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

India stock markets : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 1139.07 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు ఎఫ్​ఐఐలు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 2607.98కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel