Retail investors wealth : స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నా- పోర్ట్​ఫోలియో డౌన్​లోనే ఉందా?-sensex at all time high but not a happy year for many investors this is the reason ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Sensex At All-time High But Not A Happy Year For Many Investors. This Is The Reason

Retail investors wealth : స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నా- పోర్ట్​ఫోలియో డౌన్​లోనే ఉందా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 26, 2022 10:51 AM IST

Stock market retail investors wealth : స్టాక్​ మార్కెట్లు దూసుకెళుతున్నాయి. కానీ మీ పోర్ట్​ఫోలియోలోని స్టాక్స్​ మాత్రం పెరగడం లేదా? ఇందుకో కారణం ఉంది.

స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నా- పోర్ట్​ఫోలియోలో మార్పు లేదా? కారణం ఇదే!
స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నా- పోర్ట్​ఫోలియోలో మార్పు లేదా? కారణం ఇదే! (AP)

Stock market retail investors wealth : 'బ్యాంక్​ నిఫ్టీ.. రోజుకో ఆల్​ టైమ్​ హైని చూస్తోంది.. బీఎస్​ఈ సెన్సెక్స్​.. ఇటీవలే రికార్డు స్థాయికి చేరింది.. నిఫ్టీ50.. ఆల్​ టైమ్​ హైకి అత్యంత సమీపంలో ఉంది..'- ఇవీ రోజు బిజినెస్​ పేజ్​లో కనిపిస్తున్న వార్తలు. దేశీయ సూచీలను చూస్తుంటే.. అంతా బాగానే కనిపిస్తోంది. కానీ.. పోర్ట్​ఫలియోలోని స్టాక్స్​లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించడం లేదని చాలా మంది మదుపర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా.. రీటైల్​ ఇన్​వెస్టర్లు చాలా ఆలోచించేస్తున్నారు. సూచీలు పెరుగుతున్నా.. పోర్ట్​ఫోలియోలోని స్టాక్స్​ పెరగకపోవడానికి ఓ కారణం ఉంది.. అదేంటంటే!

ట్రెండింగ్ వార్తలు

మిడ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ ఎఫెక్ట్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి బీఎస్​ ఈ సెన్సెక్స్​.. 62,447 వద్ద ఆల్​ టైమ్​ హైలో ముగిసింది. నిఫ్టీ50.. 18,534 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫటీ.. 43,359కి చేరింది. కానీ మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు మాత్రం.. ఆల్​ టైమ్​ హైకి చాలా దూరంలో ఉన్నాయి.

Retail investors wealth : స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. చాలా మంది రీటైల్​ ఇన్​వెస్టర్లు మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టారు. కానీ అవి పెద్దగా పెరగడం లేదు. సూచీల్లో ఇప్పుడు కనిపిస్తున్న జోరంతా.. లార్జ్​ క్యాప్​ స్టాక్స్​వే! 

రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ద్రవ్యోల్బణం కారణంగా.. అన్ని సూచీలూ ఈ ఏడాది తొలినాళ్ల నుంచి భారీగా పడ్డాయి. కానీ ప్రస్తుతం లార్జ్​ క్యాప్​ స్టాక్సే రికవరీ అవుతున్నాయి. గత కొంతకాలంగా భారీగా పతనమై.. రీటైల్​ ఇన్​వెస్టర్లు పట్టించుకోని స్టాక్స్​ కూడా పెరుగుతున్నాయి. కానీ మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​లో రికవరీ కనిపించడం లేదు.

"స్టాక్​ మార్కెట్​లో ఇది తరచూ కనిపించే విషయమే. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ మంచి ప్రదర్శన చేయకపోతే.. రీటైలర్ల పోర్ట్​ఫోలియోలో పెద్దగా మార్పులు ఉండవు. కొన్ని మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. కానీ అవి కొంత కాలం క్రితం భారీగా పడటంతో ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి స్టాక్స్​ లేకపోవడంతో పోర్ట్​ఫోలియో పెరగడం లేదు. ఉదాహరణకు.. పీఎస్​యూ బ్యాంక్స్​ని తీసుకుందాము. వీటిని గతంలో ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడవే రాణిస్తున్నాయి," అని బొనాన్జా పోర్ట్​ఫోలియో రీసెర్చ్​ హెడ్​ విషాల్​ వాఘ్​ పేర్కొన్నారు.

బడ్జెట్​ సమయం..

Mid cap small cap indices : ఈ ఏడాది ఐటీ స్టాక్స్​ భారీగా పడ్డాయి. ఐటీ సెక్టార్​లో రికవరీ కోసం ఎదురుచూస్తూ.. పీఎస్​యూ బ్యాంక్​ స్టాక్స్​ను చాలా మంది విస్మరించారని విషాల్​ అభిప్రాయపడ్డారు. కానీ ఈ సెక్టార్​ స్టాక్సే.. గత 2,3 నెలల్లో 50శాతానికి పైగా రిటర్నులు తెచ్చిపెట్టాయని స్పష్టం చేశారు.

"ఇండియా స్టాక్​ మార్కెట్లు బుల్లిష్​గానే ఉన్నాయి. భారీగా కరెక్షన్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. డిసెంబర్​లో ఎఫ్​ఐఐల పెట్టుబడులు పెద్దగా తగ్గవు. డిసెంబర్​లో సెక్టార్​ ఆధారంగా గ్రోత్​ ఉంటుంది. ఇక కొన్ని నెలల్లో బడ్జెట్​ వస్తుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో.. ఈసారి బడ్జేట్​ను అత్యంత శ్రద్ధతో తయారు చేస్తారని అంచనాలు ఉన్నాయి. ఫలితంగా.. పలు రంగాల స్టాక్స్​లో మూమెంట్​ కనిపిస్తుంది," అని స్వాస్తిక ఇన్​వెస్ట్​మార్ట్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ ప్రవేశ్​ గౌర్​ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం