Stock market news today : ఫ్లాట్‌గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 12 పాయింట్లు లాభం!
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా మొదలుపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 60,888 వద్ద కొనసాగుతోంది. 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 18,065 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 69పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 151 పాయింట్లు వృద్ధిచెంది 41,298 వద్దకు చేరింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను.. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60698-18053 వద్ద ప్రారంభించాయి.
పివొట ఛార్ట్ ప్రకారం.. 17,983-17,948 లెవల్స్ వద్ద నిఫ్టీ సపోర్టు ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,095- 18,130 వద్ద రెసిస్టెన్స్ ఉంది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. మదుపర్లు 'బై ఆన్ డిప్' స్ట్రాటజీని అమలు చేయవచ్చు. రిసిస్టెన్స్‌ను బ్రేక్ చేస్తే.. ఇంకా పైకి వెళ్లొచ్చు. ఈ లెవల్ వద్ద మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy today : ఫెడరల్ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 132, టార్గెట్ రూ. 145
- యూపీఎల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 710, టార్గెట్ రూ. 745- 750
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
టైటాన్, యాక్సిస్ బ్యాంక్, డా. రెడ్డీస్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎయిర్టెల్, విప్రో, హెచ్‌యూఎల్, ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
America stock markets : అమెరికా స్టాక్ మార్కెట్లు.. వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ చేసిన వ్యాఖ్యలు.. మదుపర్లలో మళ్లీ భయాలను తీసుకొచ్చాయి. డౌ జోన్స్ 0.46శాతం, నాస్డాక్ 1.73శాతం, ఎస్ అండ్ పీ 500 1.06శాతం మేర నష్టపోయాయి. అమెరికా అక్టోబర్ జాబ్స్ డేటా నేడు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు మరింత అప్రమత్తత వ్యవహరించారు.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 2శాతం మేర పతనమైంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.3శాతం పెరిగింది. సౌత్ కొరియా కాస్పి 0.3శాతం వృద్ధిచెందింది.
త్రైమాసిక ఫలితాలు..
బ్రిటానియా, సిప్లా, టైటాన్, గెయిల్, ఇండిగో, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్, సిటీ యూనియన్ బ్యాంక్, కమ్మిన్స్ ఇండియా, ఎస్కార్ట్స్ క్యుబోటా, గో ఫ్యాషన్, మహీంద్ర లాజిస్టిక్స్, మారికో, టీవీఎస్ సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 677.62కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 732.11కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
సంబంధిత కథనం