stock market news: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 250 పాయింట్లు డౌన్-stock market news today 03 nov 2022 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 250 పాయింట్లు డౌన్

stock market news: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 250 పాయింట్లు డౌన్

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 09:19 AM IST

stock market news: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతోంది.

నిన్న నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ
నిన్న నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ (PTI)

stock market news: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు కోల్పోయి 60,678 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కోల్పోయి 18,017 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే

టాప్ గెయినర్స్ జాబితాలో టైటన్ కంపెనీ, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే

టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే, టాటా స్టీల్, టీసీఎస్, ఎన్టీపీసీ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 394.52 పాయింట్లు కోల్పోయి 60,511.57 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 114.50 పాయింట్లు కోల్పోయి 17,968.35 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇక ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి మధ్య టెలికాం, రియాల్టీ, టెక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నిన్న సెన్సెక్స్ 215.26 పాయింట్లు (0.35 శాతం) నష్టంతో 60,906.09 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 62.55 పాయింట్లు (0.34) శాతం పడిపోయి 18,082.85 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్‌గా 3.05 శాతం క్షీణించగా, మారుతీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి.

మార్కెట్లపై ఫెడ్ ప్రభావం..

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ రేట్ల పెంపునకు విరామం ఇచ్చే అవకాశాలను నిర్ధారించడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించడంతో ఆసియా ఈక్విటీలు, వాల్ స్ట్రీట్ రాత్రిపూట నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు గురువారం ప్రతికూలంగా ఉంటాయని ట్రేడర్లు అంచనా వేశారు.

ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వడ్డీ రేట్లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

భవిష్యత్తులో వడ్డీ రేట్ల స్వల్ప పెంపుదల విషయమై పావెల్ ‘ఆ సమయం వస్తోంది. అది డిసెంబర్ సమావేశం నాటికి రావచ్చు’ అని చెప్పారు.

Whats_app_banner