Stocks to buy today : నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..!
Stocks to buy today : నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ని వెల్లడించారు నిపుణులు. ఆ వివరాలు..
Stocks to buy today : అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి నష్టాల్లో ముగిశాయి. 30 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 18,052 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్.. 69పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 151 పాయింట్లు వృద్ధిచెంది 41,298 వద్దకు చేరింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. మదుపర్లు 'బై ఆన్ డిప్' స్ట్రాటజీని అమలు చేయవచ్చు. అయితే.. 18,200 లెవల్స్ వద్ద నిఫ్టీకి బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ చేస్తే.. ఇంకా పైకి వెళ్లొచ్చు. ఈ లెవల్ వద్ద మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.
Stocks market news today ; "హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ పాటర్న్ రూపుదిద్దుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే మరో 1,2 సెషన్స్‌లో ఒడుదొడుకులు ఎదురవచ్చు. నిఫ్టీ సపోర్టు 17,950- 17,900 లెవల్స్ వద్ద ఉన్నాయి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అయితే.. అంతర్జాతీయ మార్కెట్లు అంత సానుకూలంగా లేవు. ముఖ్యంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తర్వాత.. అమెరికా నాస్డాక్ పతనమవుతోంది. రీసెంట్ స్వింగ్ ‘లో’ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. నాస్డాక్ ఇంకా కిందకు పడుతుంది. ఈ పరిణామాలు ఎదురైతే.. అంతర్జాతీయంగా మార్కెట్లు నెగిటివ్‌గా మారే అవకాశం లేకపోలేదు. అందుకే షార్ట్ టర్మ్ ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ప్రారంభించవచ్చు. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ.. దాదాపు 20పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఫెడరల్ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 132, టార్గెట్ రూ. 145
యూపీఎల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 710, టార్గెట్ రూ. 745- 750
మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్:- బై రూ. 278, స్టాప్ లాస్ రూ. 269, టార్గెట్ రూ. 295
బిర్లాసాఫ్ట్:- బై రూ. 279, స్టాప్ లాస్ రూ. 273, టార్గెట్ రూ. 289
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 565, టార్గెట్ రూ. 610
ఔరబిందో ఫార్మా:- బై రూ. 558, స్టాప్ లాస్ రూ. 554, టార్గెట్ రూ. 580
(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం