Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 40 పాయింట్లు జంప్​-stock market news today 30 december 2022 sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 30 December 2022 Sensex And Nifty Opens On A Positive Note

Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 40 పాయింట్లు జంప్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 30, 2022 09:23 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 160 పాయింట్ల లాభంతో 61,294 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 43పాయింట్లు పెరిగి 18234 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. వాస్తవానికి.. చాలా వరకు నష్టాల్లోనే ఉన్నప్పటికీ.. చివర్లో లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో నిఫ్టీ50.. 68 పాయింట్లు పెరిగి 18,191 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 223 పాయింట్లు వృద్ధిచెంది 61,133 వద్ద ముగిసింది. 424పాయింట్ల లాభంతో 43,252 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61329- 18259 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 18047- 17991 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18228- 18284 లెవల్స్​ వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : హీరో మోటోకార్ప్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2670, టార్గెట్​ రూ. 2800- రూ. 2850
  • గెయిల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 92, టార్గెట్​ రూ. 100- రూ. 102
  • ఫెడరల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 132, టార్గెట్​ రూ. 147

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టాటా మోటార్స్​, బజాజ్​ ఫినాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, టెక్​ఎం, టాటా స్టీల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market news : టెక్​ స్టాక్స్​ వృద్ధితో అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. నాస్​డాక్​ 2.59శాతం లాభపడగా.. డౌ జోన్స్​ 1.05శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.75శాతం వృద్ధి చెందాయి

ఆసియా మార్కెట్​లు సైతం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. జపాన్​ నిక్కీ, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 సూచీలు లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

చమురు ధరలు..

చమురు ధరలు శుక్రవారం కూడా పడ్డాయి. బ్రెంట్​ క్రూడ్​ ఫ్యూచర్​ 1.2శాతం పతనమై 82.26 డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news : ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 572.78కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 515.83కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం