Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!-day trading guide for today 5 stocks to buy or sell on friday 30th december ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 30, 2022 07:24 AM IST

Stocks to buy today : ట్రేడర్లు ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (MINT_PRINT)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. వాస్తవానికి.. చాలా వరకు నష్టాల్లోనే ఉన్నప్పటికీ.. చివర్లో లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో నిఫ్టీ50.. 68 పాయింట్లు పెరిగి 18,191 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 223 పాయింట్లు వృద్ధిచెంది 61,133 వద్ద ముగిసింది. 424పాయింట్ల లాభంతో 43,252 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్​లో పెద్ద పాజిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. గత కొన్ని ట్రేడింగ్​ సెషన్స్​కు ముందు వచ్చిన రివర్సల్​కు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. 18,200 లెవల్ నిఫ్టీకి కీలకంగా ఉంది.

Stock market news today : "గత నాలుగు రోజుల్లో.. నిఫ్టీ50 మూడు రోజులు పెరిగింది. ఇక ఇప్పుడు 18244- 118255 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. 17977 వద్ద సపోర్ట్​ ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ రీటైల్​ రీసెర్చ్​ హెడ్​ దీపక్​ జసానీ వెల్లడించారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

US Stock markets news : టెక్​ స్టాక్స్​ వృద్ధితో అమెరికా మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. నాస్​డాక్​ 2.59శాతం లాభపడగా.. డౌ జోన్స్​ 1.05శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.75శాతం వృద్ధి చెందాయి

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 572.78కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 515.83కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy : హీరో మోటోకార్ప్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2670, టార్గెట్​ రూ. 2800- రూ. 2850

గెయిల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 92, టార్గెట్​ రూ. 100- రూ. 102

ఫెడరల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 132, టార్గెట్​ రూ. 147

ఉగర్​ షుగర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 97, టార్గెట్​ రూ. 115

పిడిలైట్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 2603​, స్టాప్​ లాస్​ రూ. 2550, టార్గెట్​ రూ. 2710

(గమనిక:- ఇవి నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం