Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లకు లాభాలు..
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 107 పాయింట్లు పెరిగి 61,981 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు వృద్ధిచెంది 18,351 వద్ద ట్రేడ్ అవుతోంది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో దాదాపుగా నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు.. చివరి సెషన్లో భారీగా పుంజుకున్నాయి. చివరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 61,873 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 18,321 వద్ద స్థిరపడింది. యూఎస్ డెట్ సీలింగ్‌పై ఆందోళన కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం గమనార్హం. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61,985- 18,368 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
ఐషేర్ మోటార్:- బై రూ. 3651, స్టాప్ లాస్ రూ. 3555, టార్గెట్ రూ. 3810
వోల్టాస్:- బై రూ. 812.55, స్టాప్ లాస్ రూ. 790, టార్గెట్ రూ. 855
జేఎస్‌డబ్ల్యూ స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 674, టార్గెట్ రూ. 720
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, కొటాక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్‌సీఎల్‌టెక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, టాటా మోటార్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:- Heritage Foods Q4 results: 52 వారాల గరిష్టానికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు; Q4 లో భారీ లాభాలు; డివిడెండ్
అంతర్జాతీయ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.11శాతం నష్టపోగా ఎస్ ఎండ్ పీ 500 0.88శాతం పెరిగింది. ఇక నాస్డాక్ ఏకంగా 1.71శాతం మేర వృద్ధిచెందింది.
Stocks to buy today : ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్‌లో జపాన్ నిక్కీ 0.43శాతం వృద్ధిచెందింది. సౌత్ కొరియా కాస్పి 0.19శాతం పెరిగింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 స్వల్ప నష్టాల్లో ఉంది.
చమురు ధరలు..
చమురు ధరలు 3.6శాతం మేర పడ్డాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.55 డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 589.1 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 338.44కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
సంబంధిత కథనం