Heritage Foods Q4 results: 52 వారాల గరిష్టానికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు; Q4 లో భారీ లాభాలు; డివిడెండ్-heritage foods rally 9 percent to hit fresh 52 week high as q4 net profit zooms 41 percent yoy
Telugu News  /  Business  /  Heritage Foods Rally 9 Percent To Hit Fresh 52-week-high As Q4 Net Profit Zooms 41 Percent Yoy
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

Heritage Foods Q4 results: 52 వారాల గరిష్టానికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు; Q4 లో భారీ లాభాలు; డివిడెండ్

25 May 2023, 20:24 ISTHT Telugu Desk
25 May 2023, 20:24 IST

Heritage Foods Q4 results: 2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) లో హెరిటేజ్ ఫుడ్స్ మంచి ఫలితాలను సాధించింది. దాంతో, గురువారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ విలువ 9% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది.

2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) లో హెరిటేజ్ ఫుడ్స్ మంచి ఫలితాలను సాధించింది. దాంతో, గురువారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ విలువ 9% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. Q4FY23లో సంస్థ నికర ఆదాయం రూ. 820.96 కోట్లకు చేరింది. Q4FY22 లో హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన నికర ఆదాయం రూ. 698.35 కోట్లతో పోలిస్తే Q4FY23 లో సంస్థ 17.93% అధికంగా ఆదాయం సముపార్జించింది.

Heritage Foods dividend: రూ. 2.50 డివిడెండ్

Q4FY23 ఫలితాలతో పాటు ఫైనల్ డివిడెండ్ ను కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటించింది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 2.50 డివిడెండ్ గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆగస్ట్ 29 వ తేదీ లోగా షేర్ హోల్డర్లకు డివిడెండ్ మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించింది. Q4FY23 లో హెరిటేజ్ ఫుడ్స్ రూ. 17.93 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY22 లో హెరిటేజ్ ఫుడ్స్ ఆర్జించిన రూ. 12.68 కోట్ల నికర లాభాలతో పోలిస్తే, Q4FY23 లో హెరిటేజ్ ఫుడ్స్ ఆర్జించిన నికర లాభాలు 41.36% అధికం. హెరిటేజ్ ఫుడ్స్ ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS) కూడా రూ. 1.39 నుంచి రూ. 1.93 కి చేరింది. Q4FY23 లో సంస్థ సగటు పాల సేకరణ రోజుకు 14.30 లక్షల లీటర్లని సంస్థ వెల్లడించింది. ఇది Q4FY22 లో 12.16 లక్షల లీటర్లను తెలిపింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధి ని కొనసాగించామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. సంస్థ గణనీయమైన లాభాలను ఆర్జించడం వెనుక హెరిటేజ్ బ్రాండ్ పై వచ్చిన వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (VAP) సాధించిన విజయం కూడా ఉందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వ్యాల్యూ గురువారం రూ. 189.2 వద్ద ప్రారంభమై, 52 వారాల గరిష్టానికి చేరి, రూ. 206 వద్ద ముగిసింది.