Stocks to buy today : స్టాక్స్​ టు బై.. టాటా పవర్​, సిప్లా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే!-day trading guide for today five buy or sell stocks for friday may 26 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. టాటా పవర్​, సిప్లా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. టాటా పవర్​, సిప్లా షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
May 26, 2023 08:12 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​.. (iStock)

Stocks to buy today : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దాదాపుగా నష్టాల్లో ట్రేడ్​ అయిన స్టాక్​ మార్కెట్​లు.. చివరి సెషన్​లో భారీగా పుంజుకున్నాయి. చివరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 98 పాయింట్ల లాభంతో 61,873 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 18,321 వద్ద స్థిరపడింది. యూఎస్​ డెట్​ సీలింగ్​పై ఆందోళన కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు పుంజుకోవడం గమనార్హం.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 589.1 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 338.44కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Multibaggers: లక్ష రూపాయలను పదేళ్లలో కోటి రూపాయలుగా మార్చిన మ్యాజిక్ స్టాక్స్ ఇవే..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.11శాతం నష్టపోగా ఎస్​ ఎండ్​ పీ 500 0.88శాతం పెరిగింది. ఇక నాస్​డాక్​ ఏకంగా 1.71శాతం మేర వృద్ధిచెందింది.

స్టాక్స్​ టు బై..

ఐషేర్​ మోటార్​:- బై రూ. 3651, స్టాప్​ లాస్​ రూ. 3555, టార్గెట్​ రూ. 3810

Stock market news today : వోల్టాస్​:- బై రూ. 812.55, స్టాప్​ లాస్​ రూ. 790, టార్గెట్​ రూ. 855

జేఎస్​డబ్ల్యూ స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 674, టార్గెట్​ రూ. 720

టాటా పవర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 202, టార్గెట్​ రూ. 222

సిప్లా:- బై రూ. 945, స్టాప్​ లాస్​ రూ. 920, టార్గెట్​ రూ. 975

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)