Reliance smart city near Gurugram: రిలయన్స్ కు 100 శాతం సబ్సిడయిరీ అయిన MET City (METL) 8 వేల ఎకరాల్లో గురుగ్రామ్ సమీపంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే జపాన్ కు చెందిన ఒక సంస్థ తమ మెడికల్ డివైజెస్ యూనిట్ కోసం శంకుస్థాపన కూడా చేసింది.
మోడల్ ఎకనమిక్ టౌన్ షిప్ లిమిటెడ్(Model Economic Township Limited -MET City) గురుగ్రామ్ దగ్గరలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీని నిర్మిస్తోందని రిలయన్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ MET City అనేది ఒక Japan Industrial Township (JIT). ఈ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ లో జపాన్ కు చెందిన 4 లీడింగ్ ఇండస్ట్రీస్ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అందులో ఒకటైన Nihon Kohden ఇప్పటికే తమ మెడికల్ డివైజెస్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన కూడా చేసింది.
ఈ MET Cityలో జపాన్ లో ప్రముఖ కంపెనీలైన Nihon Kohden తో పాటు Panasonic, Denso, T-Suzuki భాగస్వామ్యులుగా ఉన్నాయి. దాదాపు 400 ఇండస్ట్రియల్ యూనిట్ల నిర్మాణానికి అవకాశం ఉన్న ఈ స్మార్ట్ సిటీలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నివాస సముదాయాలను కూడా నిర్మిస్తారు. ఇక్కడ యూనిట్లను స్టార్ట్ చేయాలనుకునే కంపెనీలకు నేరుగా వచ్చి పనులు ప్రారంభించుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మెట్ సిటీ సీఈఓ గోపాల్ తెలిపారు.