Moto G72 । మోటోరోలా నుంచి కలర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు కూడా ఫుల్!-motorola moto g72 smartphone with oled display 108mp camera launched check price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moto G72 । మోటోరోలా నుంచి కలర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు కూడా ఫుల్!

Moto G72 । మోటోరోలా నుంచి కలర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు కూడా ఫుల్!

HT Telugu Desk HT Telugu
Oct 03, 2022 03:20 PM IST

మోటోరోలా నుంచి Moto G72 స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇందులో అన్ని ఫీచర్లు బాగున్నాయి కానీ, అదొక్కటే మైనస్ పాయింట్. వివరాలు చూడండి.

Moto G72
Moto G72

మోటోరోలా కంపెనీ తమ G-సిరీస్‌లో మరొక హ్యాండ్‌సెట్‌ను చేర్చింది. తాజాగా Moto G72 పేరుతో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Moto G72 అనేది మిడ్-రేంజ్ బడ్జెట్లో కంపెనీ నుంచి విడుదలైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇందులో డిస్‌ప్లే, కెమెరాలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ఫోన్‌లో MediaTek చిప్‌సెట్, Samsung HM6 సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌, అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన OLED డిస్‌ప్లే మొదలైన ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో బిలియన్ కలర్ 10-బిట్ 120Hz పోలెడ్ డిస్‌ప్లే కలిగిన భారతదేశపు మొట్టమొదటి ఫోన్ Moto G72 అని కంపెనీ పేర్కొంది.

మోటోరోలా ఈ ఏడాది Moto G82 విడుదల చేసింది, ఆ తర్వాత Moto G62 మోడల్ ను విడుదల చేసింది. ఇప్పుడు Moto G72 ప్రవేశపెట్టింది. ఈ G72 మోడల్ అనేది Moto G71కు సక్సెసర్. అయితే ఇవన్నీ 5G సపోర్ట్ చేసే మోడల్స్ కాగా, తాజాగా విడుదలైన Moto G72 స్మార్ట్‌ఫోన్‌ 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5G కనెక్టివిటీ లేదు. ఈ ఒక్క అంశం మినహాయిస్తే మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో Moto G72 మెరుగ్గానే ఉంది.

ఈ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, డ్యూయల్ మైక్రోఫోన్‌లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. నీటి నిరోధకత కోసం ఇది IP52 రేటింగ్ కలిగి ఉంది. Moto G72 ఏకైక స్టోరేజ్ కాన్ఫిగరేషన్లో లభిస్తుంది. అయితే పోలార్ బ్లూ, మెటోరైట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్‌లో అందిస్తున్న ఫీచర్ల జాబితాను ఈ కింద పరిశీలించండి.

Motorola Moto G72 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల OLED FHD+ డిస్‌ప్లే
  • 6GB LPDDR4 RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్
  • వెనకవైపు 108MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

కనెక్టివిటీ కోసం 4G LTE, బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ఈ ఫోన్ అక్టోబర్ 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. Moto G72 స్మార్ట్‌ఫోన్‌ ధర, రూ. 18,999/-. లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం